"బంగారు భవిష్యత్తు కోసం ధ్యానమార్గం"

 

నా పేరు "మహేందర్". వరంగల్ జిల్లా, "మేచరాజుపల్లి" గ్రామానికి చెందిన వ్యవసాయదారుల కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్న "వెంకన్న" మరి మా అమ్మ "లింగమ్మ".

నేను చిన్నప్పటినుంచీ చదువులో ముందుంటూ పదవ తరగతిలో 536 మార్కులు సాధించాను. నిజాం కాలేజీలో నేను డిగ్రీ చదువుతూ ఉండగా తీవ్ర రొడ్డు ప్రమాదానికి గురి అయ్యాను. వెన్నెముకకు బలంగా దెబ్బతగిలి డిస్క్ తొలగి దాదాపు రెండు సంవత్సరాలపాటు డాక్టర్ల చుట్టూ తిరిగి చికిత్స చేయించుకున్నాను.

వేల రూపాయల మందులు వాడినా నాకు లాభం లేకపోవడంతో 19 సంవత్సరాల వయస్సులో మంచానికే నా బ్రతుకు అంకితం అవుతుందన్న భయంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. బాక్ పెయిన్, ఎడమకాలు గాయం నన్ను నిద్రపోనివ్వలేదు. అల్లోపతి, హోమియోపతి లాంటి రకరకాల చికిత్సలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాను. చదువులో వెనుకబడిపోయాను.

కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూన్న మా కుటుంబానికి నేను ఒక భారంలా తయారయ్యాను అని బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడిపాను.

నాకు చదువన్నా, క్రికెట్ ఆడడం అన్నా చాలా ఇష్టం. బలవంతంగా లేచి ఫ్రెండ్స్‌తో కొద్దిసేపు క్రికెట్ ఆడినా నొప్పితో విలవిలలాడిపోయేవాడిని. నా శరీరం అంతా మందులతో నిండిపోయి యూరిన్‌కి వెళ్ళినా మందుల వాసన వచ్చేది. భవిష్యత్తు గురించిన బెంగతో ఇక చావే శరణ్యం అనుకుంటూ ఒకరోజు పడుకునే ముందు "దేవుడా! ఈ నొప్పి తగ్గే మార్గం చూపించి నాకు బ్రతకడానికి ఒక్క అవకాశం ఇవ్వు" అని వేడుకుని నిద్రపోయాను.

మర్నాడే నా మిత్రుడు కిషన్ కలిసి "ధ్యానం చెయ్యి అంతా బాగుంటుంది" అని చెప్పి నాతో 12 నిమిషాలు ధ్యానం చేయించాడు.

అంతకుముందు నేను నిజాం కాలేజీ హాస్టల్‌లో ఉన్నప్పుడు తను రోజూ ధ్యానం చేసుకుంటూంటే చూసి పట్టించుకునేవాడిని కాదు. కానీ ఆరోజు నేను ధ్యానం చేస్తూంటే నా శరీరం అంతా తేలికగా అయిపోయి నేను గాలిలో తేలినట్లు అనుభూతి చెందాను.

అప్పుడే 2013 "ధ్యానమహాచక్రం - VI" జరుగుతూ ఉండడంతో నా స్నేహితుడు తన స్వంత డబ్బులతో నన్ను కడ్తాల్, కైలాసపురికి తీసుకుని వెళ్ళాడు. నేను కూడా నా మందులన్నీ జాగ్రత్తగా వెంట తీసుకుని వెళ్ళాను. అక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలం పత్రీజీ వేణునాదంలో ధ్యానం ఒకానొక గొప్ప అనుభవం! చక్కటి విశ్వశక్తితో నా శరీరం నిండిపోయేది. అక్కడి ధ్యానుల ధ్యానానుభవాలు చాలా అద్భుతంగా ఉండేవి. రెండు రోజుల తరువాత పత్రీజీతో కలిసి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి ట్రెక్కింగ్ వెళ్ళి .. అక్కడ హాయిగా ఈత కొట్టాను.

అయితే కాలికి గాయం, నడుమునొప్పి, సయాటికా నొప్పి .. ఇలా రకరకాల నొప్పులతో గత రెండేళ్ళుగా నడువలేని నేను ఆ ట్రెక్కింగ్‌లో నడవడమే కాదు ఈత కూడా కొట్టేసాను. ఇక దాంతో నామీద నాకే నమ్మకం వచ్చేసి బ్యాగ్‌లోంచి నా వెంట తెచ్చుకున్న మందులన్నీ తీసి అక్కడే పడేసి .. హాయిగా పత్రీజీ వెంట తిరుగు ప్రయాణం అయ్యాను. అప్పటు నుంచి ఇప్పటి వరకు నో మెడిసన్ .. నో డాక్టర్! చక్కగా కాలేజీకి వెళ్ళి B.Com పూర్తిచేసి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో M.Com పూర్తిచేశాను. ప్రస్తుతం అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ బంగారు భవిష్యత్తుకోసం పరుగు పెడుతున్నాను.

M. మహేందర్ - హైదరాబాద్
- 9533368787.

Go to top