"PSSM వియత్నాం"

 

హాయ్..! నా పేరు "Vo Thi Kim Cue". నేను ఏడు సంవత్సరాల క్రితం వరకు వియత్నాం దేశంలోని హోచిమిన్ సిటీలో ఒక విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తను. బయటికి చూడటానికి భౌతిక జీవితంలో ఏ లోటూ లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో జీవించేదానిని. కానీ అంతరంగిక జీవితంలో మాత్రం ఎంతో "లోటు"ను అనుభవించేదానిని. అన్నీ ఉన్నా కారణం తెలియక విపరీతమైన ఒంటరితనంతో బాధపడేదానిని.

వ్యాపారం పనులలో బిజీగా ఉన్నంతసేపు సరే కానీ .. ఒక్కదాన్నే రిలాక్స్‌డ్‌గా కూర్చున్నప్పుడు .. "నా జీవితం యొక్క పరమార్థం ఏమిటి?" .. "కేవలం ఈ డబ్బు మరి ఆస్తులు సంపాదించడానికేనా నేను పుట్టింది?" అందరిలాగే నేను కూడా ఇవన్నీ సంపాదించేస్తున్నాను కదా .. మరి "నా గొప్పతనం ఏంటి?" .. "డబ్బు సంపాదించడం, తినడం, నిద్రపోవడం, ప్రయాణాలు చెయ్యడం, పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆటలు ఆడడం .. ఇంతేనా ఇక జీవితం అంటే" అన్న ప్రశ్నలు ఒకవైపు అయితే "అసలు చనిపోయిన తరువాత మనం ఏమవుతాం?" అన్న ప్రశ్న మరొకవైపు నన్ను వెంటాడుతూ ఉండేవి.

వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు చదివాను .. స్థానికంగా ఉన్న పగోడాలకు వెళ్ళి అక్కడి మాస్టర్లను అడిగేదానిని. కానీ అవేవీ నా ఆత్మను సంతృప్తిపరచలేకపోయాయి. ఈ క్రమంలోనే PSSM "మాస్టర్ రామ్" గారు నిర్వహిస్తూన్న యోగా సెంటర్ గురించి నాకు తెలిసింది.

అక్కడ నేను చేసిన 40 రోజుల ధ్యానం నన్ను ఎంతగానో రిలాక్స్ చేసింది. క్రమక్రమంగా నాలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకడంతో పాటు నాజీవన విధానంలో కూడా ఎంతో మార్పును తీసుకుని వచ్చింది.

ఇక వెంటనే "PSSM - VIETNAM" లో నేను క్రియాశీలక మెంబర్‌గా మారి నా పరిధిలో ధ్యానప్రచార కార్యక్రమాలను చెయ్యడం మొదలుపెట్టాను. పౌర్ణమి ధ్యానం మరి పత్రీజీ ధ్యాన తరగతులలో క్రమం తప్పకుండా పాల్గొనడమే కాకుండా వాటిని నేను కూడా నిర్వహిస్తూ వచ్చాను.

2017 ఆగస్ట్ నెలలో ఆస్ట్రేలియా పిరమిడ్ మాస్టర్ ప్రదీప్ విజయ్ గారి 144 ముఖాల డివైన్ క్రిస్టల్‌తో ధ్యానం చేసే అవకాశం నాకు బ్యాంకాక్‌లో జరిగిన పత్రీజీ కార్యక్రమంలో కలిగింది. అద్భుతమైన ఆ క్రిస్టల్ ఎనర్జీని అందరికీ పరిచయం చెయ్యాలని అక్టోబర్ నెలలో ప్రదీప్‌తో కలిసి వియత్నాంలో అనేక ధ్యాన కార్యక్రమాలను నిర్వహించాం.

ఈ క్రమంలోనే మరి "Da Lat, City" లో ఒక ధ్యాన పిరమిడ్‌ను కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది. క్రమం తప్పని శ్వాస మీద ధ్యాస ధ్యాన తరగతులతో ప్రస్తుతం మేము వియత్నాం దేశం అంతటా చక్కటి ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఇంత గొప్పగా జీవించే అవకాశాన్ని కలిగించిన పత్రీజీకి శతకోటి వందనాలు!

Vo Thi Kim Cue - వియత్నాం దేశం

This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top