"విశ్వం కోసం మనం పనిచేస్తే .. ఆ విశ్వం మన కోసం పనిచేస్తుంది"

 

నా పేరు "కనకదుర్గ".

2011వ సంవత్సరం నుంచి నేను ధ్యానం చేస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాను. నేను క్రాప్ సర్కిల్స్ వర్క్ చేస్తూంటాను. ఈ మధ్య నాకు ఎదురైన అనుభవం ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను విజయవాడ, B.T.P.S రోడ్డు, మధురానగర్, పప్పులమిల్లు దగ్గర ఉంటాను. ఒకరోజు "ధ్యానజగత్" మ్యాగజైన్ కోసం నా హ్యాండ్‌బ్యాగ్‌ను స్కూటీ డిక్కీలో పెట్టి " Om Arts" కు వెళ్ళాను.

మ్యాగజైన్ లేకపోవడంతో నేను వేరే పనిమీద చుట్టాలింటికి వెళ్ళి డిక్కీ తెరిచి చూస్తే నా బ్యాగు కనబడలేదు. అందులో క్రాప్ సర్కిల్స్ పుస్తకాలు, ఇంటి తాళాలు, డబ్బులు ఉన్నాయి. వేరే వారికి ఆ పుస్తకాల విలువ తెలియక ఎక్కడ పడేస్తారో అని బాధపడుతూ ఆ రాత్రి చుట్టాలింటిలోనే ఉండిపోయాను.

మరిసటిరోజు ఉదయం మా ఇంటి ఓనరు కళ్యాణి మేడమ్ గారు ఫోన్ చేసి "మేడమ్! మీ హ్యాండ్‌బ్యాగ్ పక్కింటి వారి గుమ్మంలో ఉంది; అందులోని క్రాప్ సర్కిల్స్ పుస్తకాలు చూసి అది మీదేనని ఇచ్చి వెళ్ళారు" అనగానే నా సంతోషం అంతా ఇంతా కాదు.

ఎక్కడో పోయిన బ్యాగ్ మళ్ళీ నా ఇంటి దగ్గరికి రావడం నిజంగా అద్భుతం. "మనం విశ్వం కోసం పనిచేస్తూ ఉంటే ఆ విశ్వం మన పని చేస్తుంది" అనడానికి ఇది ఒక ఉదాహరణ!!

 

కనకదుర్గ - విజయవాడ
కృష్ణాజిల్లా
-95058 14512

Go to top