"ధ్యానంతో అనారోగ్యం మటుమాయం"

 

నా పేరు "విజయలక్ష్మి".

నేను 2014 సంవత్సరంలో మా పెద్దమ్మాయి "లత" ద్వారా ధ్యానంలోకి వచ్చాను. అప్పటికే నేను షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో నాకు చీరకట్టుకోవడం, జడవేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. చేతులు పటుత్వం ఇచ్చేవి కావు. అటువంటి పరిస్థితులలో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏలూరు వెళ్తే ధ్యానం గురించి చెప్పి నాతో ధ్యానం చేయించింది.

ఒక గంట ధ్యానంలో నా శరీరం తేలికగా అనిపించి "నేను ఎలాగైనా ధ్యానం చేసిపట్టుదలతో నా శరీర బాధల్ని తగ్గించుకోవాలి" అని ఆ క్షణాన నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మాయి "నొప్పులు ఉన్నప్పుడు గంట ధ్యానం చాలదు ఇంకొంచెం ఎక్కువ సేపు ధ్యానం చేయాలి .. అప్పుడు వెంటనే ఫలితం కనిపిస్తుంది" అని చెప్పింది.

ఇక మా "చిత్రకొండ" కు వచ్చేసాక రోజుకు 6.00 గంటలు చొప్పున 40 రోజులు .. రోజుకు 5.00 గంటల చొప్పున 40 రోజులు .. రోజుకు 2 గంటలు చొప్పున 40 రోజులు ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో నా పనులన్నీ చేసుకుంటూ హాయిగా ఉన్నాను!

మా ఊరిలో మా అమ్మాయి ద్వారా ధ్యానం క్లాసులు పెడుతూ ఉన్నాము. "ధ్యానం చేసి ఆరోగ్యం వస్తేనే ఇంత బాగుంటే ఇక పిరమిడ్ కడితే ఇంకెంత బాగుంటుందో" అనిపించి మా అమ్మాయిని అడిగాము.

వెంటనే మా అమ్మాయి .. పత్రీజీ ద్వారకాతిరుమలకు వచ్చినప్పుడు "ప్రతి ఒక్కరూ స్వంత ఊరిలో, పుట్టిన ఊరిలో పిరమిడ్ కట్టమని చెప్పారు. నా కోరిక కూడా అదే మీ కోరిక, పత్రీజీ కోరిక అదే కనుక పిరమిడ్ కట్టి విశ్వకళ్యాణంలో మనం భాగస్వాములం అవుదాం" అంది. అదే పనిగా 15'X15' సైజు పిరమిడ్ నిర్మాణం పూర్తి చేసుకుని

పత్రీజీ మహారాజ్ చేతులు మీదుగా రంగరంగ వైభవంగా 2018 మార్చి 18వ తేదీన ప్రారంభోత్సవం జరిగింది. "మా ఆనందానికి అవధులు లేవు .. ఇప్పటికీ కలగానే ఉంది! సార్ రావడం .. పిరమిడ్ కట్టడం .. అసలు ఏమి ఇచ్చి ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి?" మా అమ్మాయి "ధ్యానం చేసి ధ్యాన ప్రచారం ద్వారా ఋణం తీర్చుకోవాలి" అంది.

ఇంతటి జ్ఞానాన్ని పంచిన మన పత్రీజీకి శతకోటి ప్రణామాలతో, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

 

శ్రీకాకుళపు విజయలక్ష్మి - మల్కాస్‌గిరి జిల్లా
చిత్రకొండ- ఓడిషా రాష్ట్రం
-087633 04654

Go to top