నేను.. ఇప్పుడు అందరికీ మిత్రుడినే "

 

 

నా పేరు శ్రీను.

నేను విద్యుత్ సబ్ స్టేషన్ లో షిప్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను.

నేను ధ్యానంలోకి రాకముందు ప్రపంచంలో ఉన్న చెడు అలవాట్లలో సగం నా దగ్గరే ఉండేవి ! చాలా విచ్చలవిడిగా తిరిగే నన్ను చూసి .. మా కుటుంబ సభ్యులే భయపడేవారు. మా నానగారితోసహా .. "వీడు తాగేసి వుంటాడు. ఏమంటాడో, ఎవరిని కోప్పడతాడో, ఇంట్లో ఏం పాడుచేస్తాడో" అనే భయంతో గజ గజలాడేవారు. నా భార్య కూడా నన్ను చూసి ఒక తీచర్ దగ్గర విద్యార్ధిలా చేతులు కట్టుకుని నిలబడేది.

 

అంతటి దుర్మార్గుడినైన నేను .. M. త్రిమూర్తులు మాస్టారు ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. వారు నన్ను శ్రీ శ్రీ శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమానికీ, విశాఖ జిల్లా .. భీమ్ సింగ్ ఆశ్రమ నిర్వాహకులు రజిత మేడమ్ ల దగ్గరికి తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేసారు.

 

"ధ్యానం అంటే ఏమిటి ? జీవితంలో కష్టాలు, సుఖాలూ, భయాలూ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి ? తోటీవారితో ఎలా మెలగాలి ?" వంటి చాలా విషయాలు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నర్సీపట్నం .. శారదా స్కూల్ లో ఏర్పాటుచేసిన ధ్యానశిక్షణ కార్యక్రమంలో .. మొట్టమొదటి సారి బ్రహ్మర్షి పత్రీజీ ని చూసి వారితో కరచాలనం చేసాను. ఆ తరువాత .. 2010 డిసెంబర్ లో జరిగిన అమరావతి ధ్యానమహాచక్రానికి వెళ్ళి అక్కడ ఏడు రోజులపాటు ఉండిపోయాను.

 

అన్ని వేలమంది మాస్టర్లతో కలిసి అక్కడ ధ్యానం చేయడం మరి ప్రతిరోజు బ్రహ్మర్షి పత్రీజీతో పాటు గొప్ప గొప్ప మాస్టర్లనుంచి ఆత్మజ్ణాన ప్రబోధాలను అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. ఇక అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ నాకు కనిపించిన ప్రతిఒక్కరికీ ఈ ధ్యాన అమృతాన్ని అందిస్తున్నాను.

 

గతంలో అందరిచే పరమదుర్మార్గుడు అని ముద్ర వేయించుకున్నా నేను .. ఇప్పుడు ఎంతో జ్ణానవంతంగా దానిని చెరిపివేసుకుంటున్నాను .. ఒకప్పుడు ప్రతి ఒక్కరికీ శత్రువులా వుండే నేను .. ఇప్పుడు అందరికీ మిత్రుడినే !

 

అలాంటి నా ధ్యాన జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు కూడా జరిగాయి. మేము క్రొత్తగా స్వంత ఇల్లు కట్టిస్తున్నాము. మోటరు బోర్ వేయిద్దామని ఇంటి స్ధలంలో ఒక మూల చూసి .. అక్కడ అరగంట ధ్యానం చేసి .. "ఇక్కడ బోర్ వేయండి" అని చెప్పాను.

 

అందరూ "ఏ సిద్ధాంతినో లేక నీళ్ళు ఎక్కడపడుతుందో చెప్పే ఇంజనీరునో తీసుకునివచ్చి చూపిస్తే బాగుంటుంది.లేకుంటే బోర్ వేయించిన డబ్బు వృధా అవుతుంది"

 

అయితే చిత్రంగా నేను ఎంతో నమ్మకంతో చెప్పిన స్ధలంలో కేవలం 65 అడుగులకే అమృతం లాంటి స్వచ్ఛమైన నీరు పడడం మరి అది చూసి మా వాళ్ళంతా ఆశ్చర్యపోవడం జరిగింది.

 

ఇది అంతా కూడా ధ్యానం ద్వారా నేను పొందిన అద్భుతమైన శక్తి తప్ప మరొకటి కాదు.

 

ఇప్పుడు నా భార్య చక్కటి సహకారంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోన్న నేను .. మా కుటుంబంలో ఒక దేవుడిలా చూడబడుతున్నాను.

 

నా గురించి నాకు తెలియజేసి .. నన్ను నేను సరిచేసుకునేలా చేసిన ధ్యానానికీ మరి ఆ ధ్యానాన్ని నాకు అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి వేల వేల ధ్యానాభివందనాలు.

 

G. శ్రీను

విశాఖపట్టణం

సెల్ : 9441106751

Go to top