" పత్రీజీకి ఎవ్వరూ సాటిరారు "

 

 నా పేరు గీత.

నేను ఆదోని నివాసిని. గత పది సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. సాదాసీదాగా బ్రతుకుతూన్న నాకూ నా కుటుంబానికీ ధ్యానం ద్వారా జీవించడం నేర్పించిన పత్రీజీ గురించి చెప్పడం నా భాగ్యంగా భావిస్తున్నాను.

 

" 2006 .. షిర్డీ ధ్యాన యజ్ణానికి " ఓ పది రోజుల ముందు నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అలాగే కుంటికాలుతో యజ్ణంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందుతూ ఎందరో మహానుభావుల్ని కలిసి వచ్చాను.

 

ఒక నెల తర్వాత పత్రీజీ ఆదోని పిరమిడ్కి వచ్చారు. " మేడమ్ ! షిర్డీలో మీ అనుభవాలు చెప్పండి ".. అంటూ నన్ను పిలిచారు. స్పీచ్ లో నా కాలు ఫ్రాక్చర్ గురించి కూడా చెప్పాను. క్లాస్ అంతా అయిన తర్వాత అందరూ సార్ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను కూడా నా చేయి ఇచ్చాను. సార్ వెంటనే అంతమందిలో కూడా " మీ కాలు ఫ్రాక్చర్ అయ్యిందా? మరి నాకు చెప్పలేదే? " అంటూ నన్ను దగ్గరకు తీసుకున్నారు !

 

ఒక తండ్రి తన పిల్లల బాగోగుల గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో .. అంత ప్రేమగా సార్ నన్ను అడిగిన తీరుకి నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. " ప్రతి ఒక్కరి గురించి ఎంత శ్రద్ధ కదా .. నా తండ్రికి ? ఆ అభిమానం చూపించడం అనేది అందరికీ సాధ్యం కాదు ! " అనిపించింది.

 

ఎంతో బిజీగా ఉన్నా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వారిని నిరాశపరచకుండా .. " ఇంకా ?! అబ్బో ?! అవునా ?! " అంటూ తనదైన శైలిలో మాట్లాడే మన సార్ కు ఎవ్వరూ, ఎవ్వరూ సాటిరారు !

* * *

గుళ్ళూ, గోపురాలూ తిరుగుతూ విగ్రహ దర్శనాలకే సంబరపడిపోతూ " దర్శనం చాలా బాగా జరిగింది " అని నిజమైన దేవుడు మనతోనే ఉంటూ, మనం తిన్నదే తింటూ .. మనకన్నా ఎక్కువ పనిచేస్తూ, మనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందిస్తూ .. " ఆనందలోకాలు ఎక్కడో లేవు .. మనం ఉన్నచోటనే ఉన్నాయి " అంటూ తెలియజేస్తున్నారు !

 

ఇలా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, అప్పుడప్పుడు ఉక్రోషంగా వుంటూ .. " నవరసాలను మన జీవితంలో పండించుకోవాలి " అంటూ మనకు ఆచరణలో చూపించే మన గ్రేట్ స్పిరిచ్యువల్ హీరో .. బ్రహ్మర్షి పత్రీజీకి .. ఆత్మాభివందనాలు !

M.K. గీత

టీచర్

ఆదోని

Go to top