" సహస్రారం బంగారు రేకులుగా విచ్చుకుంది "

 

నా పేరు హిరణ్మయి.

మేము వనస్ధలిపురం, హైదరాబాద్ లో ఉంటున్నాం.

జూన్ 3, 2011 రోజు సాయంత్రం 6.00 నుంచి 8.30 వరకు మేము మా ఇంటి డాబా పైన కూర్చుని ధ్యానం చేస్తున్నాం. ఆరోజు అమావాస్య తర్వాత వచ్చే విదియ !

 

పిరమిడ్ మాస్టర్ శ్రీ చంద్రశేఖర్ ధూళిపూడి "పత్రీజీ వేణునాదం" తో ధ్యానం చేయడం మొదలు పెట్టించారు. చక్కటి ఆహ్లాదకరమైన సాయంకాలం .. నిమిషాల్లో గాఢమైన ధ్యాన స్ధితిలోకి వెళ్ళిపోయా ! మంద్రంగా సాగుతూన్న మధురమైన సంగీతానికి అనుగుణంగా నాలో శ్వాస నెమ్మదిగా తగ్గుతూ, చివరికి పూర్తి ఆలోచనారహితస్ధితిలోకి చేరుకున్నాను. అప్పుడు నేను తీసుకునే ఊపిరి పరిమాణం అతి తక్కువగానూ, ఆలస్యంగానూ తీసుకుంటూ ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాను.

 

ఇక నెమ్మదిగా నా శరీరం తేలికగా అయిపోతూ మూసివున్న కన్నుల మాటున చక్కటి వెలుగునూ, ఆ తర్వాత చక్కని ఆకుపచ్చని ప్రకృతినీ .. చుట్టూ నీలి అంచులాంటి కొండల్నీ చూస్తూ వున్నాను !

 

అందరూ మంచి ధ్యానమగ్నులై వుండగా చంద్రశేఖర్ గారు కుండలినీ చక్రాల గురించి క్లాస్ చెప్పడం మొదలుపెట్టారు. మూలధారం – రెడ్ కలర్ తో మొదలై, వరుసగా స్వాధిష్ఠానం – ఆరెంజ్ .. మణిపూరకం .. పసుపు కలర్ .. అనాహతం – గ్రీన్ .. విశుద్ధి, బ్లూ కలర్ .. ఆజ్ణా – ఇన్ డిగో .. వాయిలెట్ .. అన్ని రంగుల్లోనూ చక్రాల్నీ, వివరిస్తూండగా .. ఆ తర్వాత వచ్చే రంగు ఓ క్షణం ముందరే నాలో చూసుకున్నాను.

 

చివరగా సహస్రారం .. నా తలపై భాగంలో ఒక బరువైన మూతవుండి అది ఒక్కసారిగా తెరుచుకున్నట్లయి, ఆ వెంటనే సహస్రకమలం బంగారు రేకులుగా విచ్చుకుంది ! అప్పుడు నా శిరస్సు అపరిమితంగా పెరుగుతున్నట్లు అనిపిస్తూ తలనిండా చల్లని వెన్నెలలాంటి విశ్వమయ ప్రాణశక్తి నా ముఖం, మెడ, హృదయం, శరీరం నిండా పరచుకోవడం అద్భుతంగా చూసుకున్నాను. అప్పటికి నా శరీరం నిటారుగా అయి కూర్చుంది నాకు తెలికుండానే.

 

ఇది నా జీవితంలో అపూర్వమైన, అద్భుతమైన, అలౌకికా నందం !

 

హిరణ్మయి

సెల్ : 8008213131

Go to top