" మీ అందరితోపాటు ధ్యానజగత్ లో పాలుపంచుకుంటున్నాను "

 

హాయ్ .. ! నా పేరు రెబెక్కా లింగ్ !

నా వయస్సు 26 సంవత్సరాలు. నేను 'బయోటెక్నాలజీ & విజువల్ కమ్యూనికేషన్స్' గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి .. ప్రస్తుతం ఉద్యోగరీత్యా సింగపూర్లో ఉంటున్నాను.

 నా అదృష్టం ఏమిటంటే .. నేను ఒక సాంప్రదాయక చైనీస్ కుటుంబంలో పుట్టడం వల్ల ధ్యానంతోపాటు 'స్ఫటికాలు' మరి 'తాయ్-చి' వంటి శాస్త్రీయ స్వస్ధతా విధానాలతో పరిచయం ఉన్న మా నాన్నగారిని నేను చిన్నప్పటినుంచీ అతి దగ్గరగా పరిశీలిస్తూ ఉండేదాన్ని ! దాంతో .. నాకు అప్పటినుంచే ఆధ్యాత్మికత అంటే .. ఆసక్తి మొదలైంది. నా మొట్టమొదటి ధ్యాన అనుభవం .. నేను నా 11వ యేట పొందడం జరిగింది. అప్పటి నుంచి రకరకాల ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ మనస్సును శూన్యస్ధితిలో ఉంచుకోవడం, సూక్ష్మశరీరయానాలు చేయడం, దివ్యచక్షు అనుభవాలు పొందడం వంటివి చాలా తమాషాగా చేస్తూండేదాన్ని.  ఇక యుక్త వయస్సు వచ్చాక .. చదువు మరి ఇతర వ్యాపకాల్లో పడి .. ఆ అద్భుత అనుభవాలను కాస్త ప్రక్కకు పెట్టేసాను.

 

2008 లో నేను సింగపూర్ లోని ఒకానొక సంస్ధలో ఉద్యోగం చేస్తూన్నప్పుడు .. ప్రముఖ జల పరిశోధకులు డాII మాస్టర్ ఎమోటో గారిని కలువడం .. మరి వారు పారిశ్రామికౌత్పత్తులకు వాడే నీటిని శక్తివంతం చేయడం తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాను.

 

అప్పటి నుంచి నాలోని నా చిన్నప్పటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త .. నిద్రాణ స్ధితి నుంచి మళ్ళీ మేల్కోవడం వల్ల .. ఇంటర్నెట్, పుస్తకాలు ఇంకా ఇంకా వివిధ పద్ధతుల ద్వారా సమాచారాన్ని క్రోడీకరించు కుంటూ నేను కూడా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. అలా నేను క్రమం తప్పకుండా ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేస్తూండగా .. ఒకరోజు 'పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ' గురించీ, 'ఆనాపానసతి' ధ్యానం గురించీ చదివాను.

 

"ధ్యానం చేస్తూ .. న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ పుస్తకాలు చదువుతూ .. చిన్నప్పటినుంచి నేను పొందిన గొప్ప గొప్ప అనుభవాలన్నీ కూడా 'గౌతమ బుద్ధుడు' వంటి గొప్ప గొప్ప యోగులు పొందిన ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ ధ్యానానుభవాలుగా తెలుసుకున్నాను. నాలో సంకల్పశక్తిని పెంచుకుంటూ .. దేహ కాంతిని గుర్తించడం, దివ్యచక్షువు ద్వారా రకరకాల సంకేతాలను, UFO లను చూడడం జరిగింది.

 

"భారత దేశంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ను స్ధాపించి .. ఎందరెందరో అంకిత భావం గల మాస్టర్స్ ద్వారా 'ధ్యాన జగత్' మహాఉద్యమాన్ని .. ప్రపంచవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవంగా సాగిస్తోన్న 'బ్రహ్మర్షి పత్రీజీ' ని ప్రత్యక్షంగా కలిసి .. వారి సమక్షంలో 'శశిధర్ రెడ్డి' గారి టీమ్ ఆధ్వర్యంలో నడుపబడుతోన్న మెడిటేషన్ సెంటర్ లో నేను సామూహిక ధ్యానం చేసి ఎంతో ఆనందాన్ని పొందాను. అప్పటినుంచి నా స్నేహితుల సహకారంతో .. నేను కూడా 'చైనా భాష' లో స్పిరిచ్యువల్ వర్క్ షాపులను నిర్వహిస్తూ .. మీ అందరితో పాటు .. ధ్యాన జగత్ ప్రచారంలో పాలు పంచుకుంటున్నాను."

 

రెబెక్కా లింగ్

e-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top