" ధ్యానంలో గొప్ప గొప్ప వాళ్ళంతా కనిపిస్తున్నారు "

 

నా పేరు సాత్విక్ సాయి.

 నేను రమాదేవి పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ లో 3వ తరగతి చదువుతున్నాను.

 రెండునెలల క్రితం వైశాఖ పౌర్ణమికి మా ఇంట్లో, పిరమిడ్ మాస్టర్ అయిన మా పెద్దమ్మ శ్రీమతి శాంతిలక్ష్మి మరి శ్రీ చంద్రశేఖర్ ధూళిపూడి గార్లు 15 రోజులు మెడిటేషన్ క్లాసులు నిర్వహించారు. అప్పుడు వారందరితో పాటుగా కూర్చుని ధ్యానం చేయమని మా తల్లిదండ్రులు.. శ్రీ అనిల్ చౌదరి, శ్రీమతి హిరణ్మయి చెప్పినా నేను ఆటపాటల్లో మునిగి ధ్యానం చేయలేదు.

 

కానీ .. ఒక రోజు సాయంత్రం అమ్మతోపాటు పిరమిడ్ క్రింద హాయిగా కుర్చుని, రెండు చేతులు వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుని, కళ్ళు రెండూ మూసుకుని నా శ్వాస మీద నేను ధ్యాస పెట్టాను.

 

కాస్సేపటికి నా తలపైన ఎవరో మెల్లగా తాకినట్లు చల్లగా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నా నుదుటి భాగంలో దురదగా అనిపించింది. అయినా కదలకుండా, కళ్ళు తెరవకుండా నా శ్వాస మీద ధ్యాసతో గమనిస్తూ ఉన్నాను. మూసివున్న కళ్ళల్లో బ్లాక్ కలర్ నెమ్మదిగా మాయమై మొదట రెడ్ కలర్ ఆ తర్వాత ఆరెంజ్ కలర్, ఆ తర్వాత ఎల్లో కలర్స్ వచ్చి మళ్ళీ మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయి, ఇద్దరు మాస్టర్స్ కనిపించారు.

 

వారి చేతి పిడికిళ్ళు బిగించి ఏదో విజయం విక్టరీ సాధించినట్లుగా ఉన్నాయి. వారి ముఖాలు చాలా కాంతివంతంగా కనిపించాయి. వారిలో ఒక మాస్టర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చొక్కా ధరించి వున్నారు. ఇంకా వారి దగ్గర ఉన్న జెండా పైన ఏనుగు ఉంది. వారి చేతులు కూడా డార్క్ పింక్, వయొలెట్ రంగుల్లోనూ, డార్క్ బ్లూ మరి సిల్వర్ కలర్లోనూ చిత్రంగా, చక్కగా కనిపించాయి.

 

ఇంతలో మా అమ్మ "చివరి ఐదు సెకండ్స్" అనడంతో కళ్ళు తెరిచి చూసిన నాకు బయట సాయంత్రం కావడం వల్ల చీకటిగా అయినా ధ్యానంలో కలిగిన నా అనుభవంలో ఎంతో స్పష్టంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

 

నాకు ఈ అనుభవం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇది నేను నా ఫ్రెండ్స్ తో చెప్పుకుని వారందరితోనూ ధ్యానం చేయిస్తున్నాను.

 

సాత్విక్ సాయి మైనేని
సెల్ : +91 8008213131

Go to top