" మనం ఎంత ధన్య జీవులమో "

 

నా పేరు మాధవాచారి.

మేము HTM నగర్, నాచారం, హైదరాబాద్ లో వుంటాం.

నేను మార్చి 16, 2011 లో ధ్యానంలోకి వచ్చాను. మా ఆవిడ జనవరి లో అంటే .. నాకంటే మూడు నెలలు ముందుగా ధ్యానంలోకి వచ్చింది ! మొదట్లో నేను ఇవన్నీ పెద్దగా నమ్మేవాడిని కాదు ! "ధ్యానం వరకు 'ఓకే' కానీ .. అనుకోవడం అంతా ఒట్టి ట్రాష్" అనుకున్నాను. మనం ఏది ఊహించుకుంటే అది కనపడినట్లుగా అనుకోవడం మనిషి మనస్సుకు ఉన్న లక్షణం అనుకున్నాను.

కానీ 2011 ఏప్రిల్ ఎడిషన్ "ధ్యానాంధ్రప్రదేశ్" లో M. ప్రణీత "ఇన్నర్ వ్యూ" చదివి ఎంతో ఆశ్చర్యపోయాను. అద్భుతమైన తన ధ్యాన అనుభవాలను వివరిస్తూ ఆ అమ్మాయి చివరగా .. "ధ్యానం బాగాచేస్తే ఇలాంటి అనుభవాలు మీరు కూడా పొందుతారు" అని చెప్పింది.

దానిని నేను చాలా సీరియస్ గా తీసుకుని ధ్యానం చేయడం మొదలు పెట్టాను. 15రోజుల తరువాత 16వ రోజు .. గంతన్నర సేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు .. అరగంట తరువాత నేను ధ్యానం బాగా డీప్ గా వెళ్ళిపోయాను ! ఇంతలో జ్ణానావతార్ "శ్రీ యుక్తేశ్వరగిరి" గారు దర్శనం ఇచ్చారు ! దాదాపు 40 నిమిషాల పాటు అలా కనిపిస్తూ నాకు ఆయన "కడ్తాల్ లోని గోశాలకు ఒక గోమాతను దానంగా ఇవ్వు" అని ఆదేశించారు. ఈలోగా బ్రహ్మర్షి పత్రీజీ కూడా నా ప్రక్కనే వచ్చి కూర్చుని భుజం మీద చేయి వేసి .. "ఇకనైనా ధ్యానాన్ని నమ్ముతావా ?" అని అడిగారు.

అప్పటి నుంచి నేను నా ధ్యానసాధనను తీవ్రం చేసాను.

ఒకరోజు నేను ధ్యానంలో కూర్చుని "అమెరికాలో ఉన్న మా పాపను చూడాలి" అని సంకల్పం చేసుకున్నాను. 40 నిమిషాల తరువాత .. మా పాప అక్కడ వంటచేస్తూ కనిపించింది ! బ్లాక్ ప్యాంట్, పింక్ టీ షర్ట్ వేసుకుని నాకు స్పష్టంగా కనపడింది !

వెంటనే నేను ధ్యానం లోంచి బయటికి వచ్చి .. వాళ్ళ అమ్మకు చెప్పగా తాను వెంటనే ఫోన్ చేసి కనుక్కుంటే “మమ్మీ ! నేను సేమ్ డ్రెస్ మీద వున్నాను ! డాడీ కరెక్టుగా చెప్పారు !" అని ఆశ్చర్యపోయింది !

మా పాప .. కూడా ధ్యానం నేర్చుకుని .. ఎన్నెన్నో అనుభవాలను పొందుతోంది. "2012 తరువాత ఏం జరగబోతోంది ?" అన్న విషయం తాను ముందుగానే చూసి వచ్చింది.

నాకు చిన్నప్పటి నుంచి "షిరిడీ సాయిబాబా" అంటే చాలా ఇష్టం ! మొన్నటి వరకు కూడా "బాబా బ్రతికివున్న రోజులలో భూమి మీద వున్న మనుష్యులు అంతా ఎంత అదృష్టవంతులో" అనుకునేవాడిని. కానీ ఈ రోజు నా కోరిక తీరింది ! బ్రహ్మర్షి పత్రీజీ భూమి మీద వున్న సమయంలో వారితో పాటు వున్న మనం కూడా ఎంత ధన్య జీవులమో తెలుసుకున్నాను.

 

T. మాధవాచారి
సెల్ : 9393938305

Go to top