" ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందాను "

 

నా పేరు అనురాధా శ్యాంసుందర్ గౌడ్.

మా ఊరు అమడబాకుల గ్రామం, కొత్తకోట మం||, మహబూబ్‌నగర్ జిల్లా.

08-06-2008 న ధ్యానంలోకి రావడం, నా జీవితంలో ఒక గొప్ప మలుపు. ఎందుకంటే అంతకుముందు నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. కొత్తకోట పిరమిడ్ మాస్టర్ ప్రేమయ్య గారు ఎన్నోసార్లు ధ్యానానికి రమ్మనేవారు. కానీ నేను వెళ్ళలేదు.

"నాకు పూజలకే సమయం సరిపోదు. ఇక ధ్యానం చేయడానికి సమయం ఎక్కడిది ? గంటల గంటలు కూర్చోవడం కుదరదు !" అనేదానిని. కానీ నా ఆరోగ్యసమస్యల్లో మాత్రం ఏ మార్పు లేదు. డాక్టర్‌లతో మందులతో నా జీవితం అస్తవ్యస్తంగా ఉండేది. నాకు వెన్నెముకలో విపరీతమైన సమస్యతో, కాళ్ళనొప్పులతో నడవడానికి ఇబ్బంది పడేదానిని.

ధ్యానం చేయడం ప్రారంభించిన 15 రోజులకే నేను కూర్చోవడం, నడవడం జరిగింది. చాలా ఏళ్ళ తరువాత నేను మెట్లు ఎక్కడం కర్నూలు జగన్నాథుని గుట్ట పైనే ! మా కొత్తకోట వాళ్ళు, బంధువులు అంతా ఆశ్చర్యంతో అడిగారు. "నువ్వు ఏ హాస్పిటల్‌కు వెళ్ళావు ? మేం కూడా వెళ్ళి చికిత్స చేయించుకుంటాం" అని వాళ్ళకు నేను "ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందాను .. మీరు కూడా చేయండి" అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ధ్యానం చేయిస్తున్నాను.

నాకు ధ్యానంలో శివునికి అభిషేకం చేస్తున్నట్లు కనబడింది. తర్వాత ఒక రోజు నేను ధ్యానం చేసే ముందు "నేను ఎవరిని ? ఎందుకు వచ్చాను ?" అని ప్రశ్న వేసుకుని ధ్యానం చేసాను,

అప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపులో ఆంజనేయస్వామి ధ్యానం చేస్తూ కనిపించాడు. "నీవు జ్ఞానివి అవుతావు" అని సందేశం వచ్చింది. నేను సూక్ష్మశరీరంతో ఆకాశం పైకి వెళ్ళడం, క్రింద అంతా జనాలు కనిపించడం జరిగింది. రెండవసారి సూక్ష్మశరీరంతో జనం మధ్యలోంచి వెళ్ళడం. మూడవసారి సూక్ష్మశరీరంతో ఆకాశం పైన పూర్తి శూన్యంలోకి వెళ్ళడం జరిగింది.

అనురాధ శ్యామ్‌సుందర్ గౌడ్
ఫోన్ : 08545-226157

Go to top