" ఇక నేను ఏదైనా సాధించగలను "

 

హాయ్ ! నా పేరు తేజస్విని. మాది హైదరాబాద్.

నేను ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను కూడా మీలాగే ధ్యానం చేస్తున్నాను. నాకు వచ్చిన ఎన్నో ధ్యాన అనుభవాలలో మీ కోసం కొన్ని తెలియజేస్తున్నాను.

నాకు 10 వ తరగతిలో మొత్తం 600 మార్కులకు గాను 559 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు కేవలం ధ్యానం చేస్తూ చక్కగా చదువుకోవడం వల్లనే వచ్చాయి. నేను 10 వ తరగతిలో అన్ని పాఠాలు బాగానే చదివేదాన్ని. కానీ మాథ్స్ అంటే చాలా చాలా భయం. మిగతా సబ్జెక్టులు బాగా చదివినా కూడా నాకు మ్యాథ్స్ లో మార్కులు తగ్గేవి. అందువలన నా లక్ష్యాన్ని నేను చేరుకునేదాన్ని కాదు. కానీ 10 వ తరగతిలో నేను కేవలం చివరి రెండు నెలలో అనగా (జనవరి, ఫిబ్రవరి) మొత్తం పుస్తకాన్ని ఔపోసన పట్టాను.

నా స్నేహితులు సంవత్సరం మొత్తం కష్టపడి చదివినదాన్ని, నేను ధ్యానం చేసి రెండు నెలల్లో అతి సులభంగా పూర్తి చేసాను ! దీనిని బట్టి అర్థమైందేంటంటే ఏ పనైనా ఎంతసేపు చేసామనేది కాదు, ఎంత శ్రద్ధతో చేసామనేది ముఖ్యం. ధ్యానం చేసి చదవటం వల్ల గంటలో చదివే పాఠాలను కేవలం అరగంటలో పూర్తి చేసేదాన్ని. చదివినది ఎంతో బాగా గుర్తుండేది. ధ్యానం చేయకుండా వందసార్లు చదివినా, ధ్యానం చేసి ఒక్కసారి చదివినా ఒక్కటే !

నేను ధ్యానం చేయకముందు చదివినా .. పాఠం మీద పట్టు ఉండేదికాదు. చాలా గందరగోళంగా ఉండేది. ధ్యానం వలన ఏకాగ్రత, పట్టుదల, నమ్మకం, ధైర్యం పెరిగి ఏదైనా సాధించగలననే నమ్మకం పెరిగింది. కాబట్టి మీరందరూ కూడా ధ్యానం చేయండి.

 

తేజస్విని

Go to top