" ఇంకెవ్వరూ ఆలస్యం చేయకండి "

 

నా పేరు బండి శ్రీనివాసరావు.

నా భార్య నిర్మలాదేవి, పెద్దమ్మాయి తేజస్విని, చిన్నమ్మాయి లలితాదేవి. మేము హైదరాబాద్లోని మలక్పేట నివాసులం.

మేము 2008 సెప్టెంబర్ నుంచి ధ్యానం మొదలుపెట్టాము. మా కుటుంబం అంతా ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం వలన ఎన్నో అద్భుతాలు మా కుటుంబంలో జరిగాయి.

ధ్యానానికి ముందు నా భార్యకు అనారోగ్యం వల్ల రక్తం తక్కువయి యశోదా హాస్పిటల్, మలక్పేటలో అడ్మిట్ అయి రూ. 50,000/- ఖర్చు అయినా కూడా అనారోగ్యం తగ్గలేదు. ఆ తరువాత హోమియో మందులు కూడా వాడాము. హోమియో మందులు రెగ్యులర్గా వాడవలసి రావడం, మందులు మానగానే వ్యాధి తిరగబడటం జరుగుతూ ఉండేది.

కానీ ఎప్పుడైతే కుటుంబం అంతా ధ్యానం చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మా కుటుంబ జీవనం పూర్తిగా మారిపోయింది. మాంసాహారులుగా ఉన్న మేం ధ్యానం మొదలుపెట్టగానే పూర్తి శాకాహార కుటుంబంగా మారాము. అప్పటి నుంచి ఇప్పటివరకూ మేం హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరం రానేలేదు నా భార్య ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూంది. చదువులో అంతంత మాత్రంగా ఉన్న మా పిల్లలు కూడా తరగతిలో టాప్ ర్యాంకర్స్ గా నిలుస్తున్నారు.

ధ్యానానికి ముందు మా కుటుంబంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, దుఃఖం, అనారోగ్యాలు ఉండేవి. ధ్యానకుటుంబంగా ఎప్పుడైతే మారామో మా కుటుంబ జీవన విధానమే మారిపోయింది. మళ్ళీ జన్మ ఎత్తినట్లుగా నిత్యం ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నాము.

నేను అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలిసో తెలియకో ఇన్నాళ్ళూ అజ్ఞానంలో మాంసాహారం తింటూ ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తున్న వారందరూ ముందుగా శాకాహారులుగా మారండి. అందరూ ధ్యానం చేస్తూ ధ్యానకుటుంబంగా మారితే, ఈ సమాజం, ఈ ప్రపంచమే మారిపోతుంది. అప్పుడు ఎక్కడ చూసినా ఆనందం, సంతోషమే. హాస్పిటల్స్ అవసరం లేని ప్రపంచాన్ని మనం చూద్దాం. హింస లేని సమాజాన్నిమనం నిర్మిద్దాం ..

ఇంత గొప్ప ధ్యానాన్ని అందరికీ అందించాలని నిత్యం అలుపెరుగక అవిరళ కృషి సల్పుతూన్న జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ కి మా కుటుంబమంతా ధ్యాన కృతజ్ఞతాభివందనం చేస్తుంది.

ఇంకెవ్వరూ ఆలస్యం చేయవద్దు. ఎన్నో సంవత్సరాలు నరకప్రాయంగా ఉన్న మీ జీవితాల్లో శాకాహారం, ధ్యానం ద్వారా వెలుగులు నింపుకోండి. అదే మనకు మోక్షం ..

 

బండి శ్రీనివాసరావు
సెల్ : 9491172863

Go to top