" ఒక్క రోజు ధ్యానంతోనే వెల్లివిరిసిన ఆత్మవిశ్వాసం "

 

 

నా పేరు శాంతకుమారి.

మావారి పేరు గౌరీశంకర్రావు. నేను వుండేది జయపూర్ పట్టణం, కోరాపుట్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రం.

శ్రీ కంచి రఘురామ్ గారు మార్చి 31, 2010 న మా ఇంటికి విచ్చేసి ధ్యానం చేసే విధానం గురించి .. ధ్యానం వలన లభించే ఆరోగ్యం గురించి తెలుసుకున్నాను.

ఈ సందర్భంగా నా ఆనారోగ్యం గురించి .. దానికి నేను వాడే మూడురకాల మాత్రలు మూడు పూటలా వాడే విధానం గురించి రఘురామ్ గారితో చెప్పగా " ధ్యానం వలన తగ్గుతుంది ; ఇక మాత్రలు వాడవద్దు " అని చెప్పారు. అప్పటి నుంచి నేను మాత్రలు వాడడం మానేసి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. రఘురామ్ గారు ఇదేరోజు వాసవీ దేవాలయంలో సాయంత్రం 6.00 గంటలకు బ్రహ్మర్షి పత్రీజీ పరిచయం చేసిన చాలా సులభంగా ఆచరించే " ఆనాపానసతి విధానం " గురించి మా ఊరిలో అందరికీ చెప్పడం జరిగింది. దీనికి నేను కూడా కొంచెం చేయూత నివ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

ధ్యానం వలన ఇన్ని లాభాలు ఉంటాయని తెలియదు. ధ్యానం అంటే మామూలు మనుష్యులు చేసుకోలేరనీ, అది కొందరికే సాధ్యమనీ అనుకునేదాన్ని. ఇప్పుడు ధ్యానం అనేది మనలోనే వున్నశ్వాసతో సంబంధమనీ, ధ్యానాన్ని ఎవ్వరైనా చేయవచ్చుననీ, ధ్యానం చేస్తే ధ్యాన లాభాలు చేసినవారికీ తప్పకుండా వస్తాయని స్వయంగా తెలుసుకుని ఎంతో ఆనందపడుతున్నాను. ఆత్మవిశ్వాసంతో మందులు వాడడం మానేశాను. నాకు ఏమి కాలేదు. ఆన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను.

ఒక్కరోజు ధ్యానంతోనే ఇంత ఆత్మవిశ్వాసం వస్తుందని తెలీదు. ధ్యానానికి కృతజ్ఞతలు. మేలో జరిగే బుద్ధపౌర్ణమికి బెంగుళూరుకు తప్పకుండా మా జయపూర్ నుంచి కొంతమంది వస్తాం. బ్రహ్మర్షి పత్రీజీ ని ప్రత్యక్షంగా చూస్తాం."

 

శ్రీమతి శాంతకుమారి
జయపూర్ (ఒరిస్సా)

Go to top