" బడుగు జీవులకు కూడా ధ్యాన ఫలాలను అందించారు పత్రీజీ "

 

నా పేరు చెన్నకేశవులు.

నా వయస్సు 45 సంవత్సరాలు. నేను గతంలో కూలిపనిచేసేవాడిని , దాంతో నా శరీరం చాలా అలసిపోయి నాకు సారా త్రాగడం అలవాటు అయ్యింది. దానికి తోడు ప్రతిరోజూ తప్పకుండా మాంసం తినేవాడిని. ఇలా పది సంవత్సరాలలో విపరీతమైన మాంసాహారం మరి సారా సేవనం నా ఆరోగ్యాన్ని చాలా పాడుచేసాయి. శరీరంలో నొప్పులతో పాటు వాంతులు, నీరసం మరి కడుపులో నొప్పితో దాదాపు రెండు నెలల కాలంలోనే నేను 30 కేజీల బరువు తగ్గిపోయాను.

నా ఆరోగ్యం బాగుచేసుకోవడానికి నేను చాలా హాస్పిటల్స్ తిరిగి ఎక్సరే, స్కానింగ్ పరీక్షలు చేయించుకుని మందులు తిన్నాను. వేలకు వేల రూపాయలు ఖర్చు అయినా నా ఆరోగ్యంలో ఏ మార్పులేదు.

చివరికి స్పెషలిస్ట్ డాక్టర్ నా భార్యను పిలిచి " నీ భర్తకు కిడ్నీలో కంతులు ఉన్నాయి ; వ్యాధి పూర్తిగా ముదిరి పోయింది ; ఇక ఆపరేషన్కు కూడా శరీరం సహకరించదు ; ఆయన బ్రతకడం కష్టం కనుక ఇంటికి తీసుకెళ్ళండి " అని చెప్పేసాడు.

ఇంటికి వచ్చాక నాకు పూర్తిగా మంచమే శరణ్యం అయ్యింది. నా మిత్రుడు మరి వనపర్తి పిరమిడ్ మాస్టర్ Dr. రామకృష్ణ మా ఇంటికి వచ్చి రోజు గ్లూకోజ్ ఎక్కించి వెళ్ళేవాడు. శాకాహారం గురించీ, ధ్యానం గురించీ నాకు, నా భార్యకు చెప్పి .. " ఇక ఈ పరిస్థితిలో ధ్యానం ఒక్కటే మీకు శరణ్యం " అని చెప్పాడు. బ్రతికే ఆశ పుర్తిగా చచ్చిపోయిన నాకు ఆ మాటలు అమృతంలా తోచాయి.

ఇక మా డాక్టర్ గారి సూచనలతో అన్నేళ్ళుగా సారాయి మీద మాంసాహారం మీద ఉన్న నా ధ్యాసను పుర్తిగా మళ్ళించి .. శ్వాస మీద .. శాకాహారం మీద .. ఉంచాను. ప్రతిరోజూ మంచం మీద పడుకునే ధ్యానం చేస్తూ ఉంటే .. క్రమంగా లేచి కూర్చుని ధ్యానం చేసే శక్తి రావడం మొదలయింది , ఇప్పుడు దాదాపు నా ఆరోగ్యం 60 శాతం బాగుపడి .. లేచి తిరుగుతూ నా పనులను మామూలుగా చేసుకోగలుగుతున్నాను .

“ బ్రతికే అవకాశాలు అస్సలు లేవు " అని మా డాక్టర్ చెప్పిన దాదాపు 50 మంది నాలాంటి పేషెంట్స్ మా ఊరిలో చనిపోయారు కానీ .. నేను మాత్రం ధ్యానం మరి శాకాహార సేవనం వల్ల చక్కగా స్వస్థత పడి మామూలుగా తిరుగుతూ .. నా శక్తిమేరకు నన్ను కలిసిన వాళ్ళందరికీ ధ్యానం గురించి చెపుతున్నాను .

నా ఫ్రెండ్ డా|| రామకృష్ణ మా ఊరిలో " ఆత్మదేవ పిరమిడ్ " కట్టడంతో చాలామంది అందులో ధ్యానం చేసి చక్కటి అనుభవాలను పొందుతున్నారు. మాలాంటి బడుగుజీవుల వరకు కూడా ఈ అద్భుతమైన ధ్యాన ఫలాలను అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి నా ధ్యానాభివందనాలు .

 

చెన్నకేశవులు
సెల్ : +91 9640140916

Go to top