" శారీరక నొప్పులు ధ్యాన శక్తితో తగ్గిపోతున్నాయి "

 

నా పేరు వీరారెడ్డి.

" నేను హైదరాబాద్ అంబర్పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షకుడిగా పనిచేస్తున్నాను.

" ‘ మాంసాహారం నీచమైన ఆహారం ’ అని తెలుసుకున్న నేను ఏడు సంవత్సరాల క్రితమే ‘ శాకాహారి ’ గా మారి నా తోటి పోలీస్ సిబ్బందికి కూడా దాని విశిష్టతను వివరిస్తూ వున్నాను. ఇప్పుడు ధ్యానం కూడా చేస్తూ వుంటే చక్కటి మానసిక ప్రశాంతతను కూడా నేను పొందుతున్నాను. మా S.P. శ్రీ అబ్రహాం లింకన్ గారు కాలేజీలో పోలీస్ సిబ్బందికి వారం రోజుల ధ్యాన శిక్షణను అందించినప్పుడు సానుకూలమైన చక్కటి ఫలితాలను వారు పొందడం జరిగింది. తీవ్రమైన ఎక్సర్సైజుల వల్ల మా పోలీసులకు కలిగే శారీరక నొప్పులు ధ్యానశక్తితో తగ్గిపోవడం ఒక అద్భుతం.

" ధ్యానంలో నేనే కాదు మా సిబ్బందిలోని ముస్లిం మరి క్రిస్టియన్ పోలిసులు సైతం తమతమ గత జన్మలను చూసుకుని ఆ తరువాత ఒకరితో ఒకరు తమ ధ్యానానుభవాలను చెప్పుకోవడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది.

" నేను Dr. V. హరికుమార్ గారితో కలిసి వెళ్ళి ‘ ధ్యానాంధ్రప్రదేశ్ ’ ఆఫీసులో బ్రహ్మర్షి పత్రీజీ ని కలిసినప్పుడు .. వారు నా పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయత నాకు చాలా నచ్చింది. మా పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఒక్కసారి విచ్చేసి వారికి ధ్యాన శిక్షణను ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరగా వారు తమ సమ్మతిని తెలియజేయడం నాకు ఆనందాన్ని కలుగజేసింది. "

 

వీరారెడ్డి
హైదరాబాద్

Go to top