" ఒకే ఒక్కడు "

 

నా పేరు అప్పారావు.

నేను " కోరమాండల్ ఫెర్టిలైజర్స్ " లో " ఆడియో విజ్యువల్ వ్యాన్ డ్రైవర్ కమ్ ఆపరేటర్ " గా 1975 వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఏప్రిల్ 2010 లో రిటైర్మెంట్ అయ్యాను.

1975 వ సంవత్సరం నుంచి " కోరమాండల్ ఫెర్టిలైజర్స్ " లో బ్రహ్మర్షి పత్రీజీ తమ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నప్పుడు వారి వ్యాన్కి డ్రైవర్గా వుంటూ వారితో కలిసి కంపెనీ టూర్లు తిరిగేవాడిని. వారితో కలిసి ఎన్నోసార్లు ఒరిస్సా రాష్ట్రం తిరిగాను. ఆయన నాకు 1976 వ సంవత్సరం నుంచే ధ్యానం చేయమని చెప్తూండేవారు. కానీ నేను వారి మాటలను పెడచెవిన పెడుతూ వచ్చి ధ్యానం చేయలేదు. ఆ తర్వాత సార్ 1992 వ సంవత్సరంలో కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు.

అనుకోకుండా మళ్ళీ 2001 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో జరిగిన ధ్యానశిక్షణా సభలో పత్రీజీని ఒక గొప్ప గురువుగా మరి ‘ బ్రహ్మర్షి ’ గా కలవడం జరిగి ఎంతో సంతోషపడ్డాను. ఆయన నాకు మళ్ళీ ధ్యానం గురించి చెప్పారు. ఇక అప్పటినుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఇంతకుముందు పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాంసం తినే అలవాట్లు వుండేవి. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నా చెడు అలవాట్లు అన్నీ మానేశాను.

ఇక నేను ఇప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. నా భార్యకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి తిరిగే మా ఆవిడ కూడా ధ్యానం చేసిన తర్వాత మందులు వాడటం పూర్తిగా మానివేసింది. ఇప్పుడు ఆరోగ్యంగా వుంది. మా ఇంటిపై ‘ పిరమిడ్ ధ్యానకేంద్రం ’ కట్టించుకున్నాం. మేం ధ్యానం చేస్తూ, చుట్టుప్రక్కల వాళ్ళతో ధ్యానం చేయిస్తున్నాం.

ఆనాడు " ఒకే ఒక్కడు " లా ధ్యానప్రచారం మొదలుపెట్టి ఈ రోజు " లోకకళ్యాణ కారకుడు " గా ఎదిగిన పత్రీజీ విశ్వరూపాన్ని కళ్ళారా చూసిన నేను .. వారి ధ్యానప్రభంజనానికి శాశ్వతత్వాన్ని కలుగజేస్తోన్న అద్భుతమైన పత్రిక " ధ్యానాంధ్రప్రదేశ్ " కి 25,000 రూపాయలు నా వంతుగా శాశ్వతనిధి రూపంలో సమర్పించుకుంటున్నాను. నాలాంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఈ పత్రిక మరింతమందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో ఈ వితరణ చేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను.

 

B. అప్పారావు
సెల్ : +91 97043 78141

Go to top