" అద్భుత శస్త్రచికిత్సకారులు - ఆస్ట్రల్ మాస్టర్స్ "

 

నా పేరు ఇందిర.

నేను వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ ను ; ప్రస్తుతం హైదరాబాద్ లోని " గవర్నమెంట్ నిజామియా జనరల్ హాస్పిటల్ " లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. నేను గత 12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తున్నాను.

రెండు నెలల క్రితం ఒక రోజు రాత్రి 11 గం|| ల సమయంలో నాకు అకస్మాత్తుగా నడుమునొప్పి మొదలై .. మూత్రంలో రక్తం పోవడం మొదలయ్యింది. కడుపులో భరించరాని నొప్పితో నేను మా హాస్పిటల్ యూరాలజిస్ట్ కు ఫోన్ చేసి .. ఆయన చెప్పిన ప్రకారం నొప్పి నివారణ ట్యాబ్లెట్ వేసుకున్నాను. అయినా బాధ తగ్గక రాత్రంతా నొప్పితో అల్లల్లాడిపోయాను.

ఉదయం " నిమ్స్ హాస్పిటల్ " కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. కుడివైపు కిడ్నీలో రాళ్ళు ఉండటంతో కిడ్నీ వాపు కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన యూరాలజిస్ట్ .. " వెంటనే ఆపరేషన్ చేసి రాయి తీయకపోతే ప్రమాదం ; హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి " అని చెప్పాడు ఆందోళనగా.

కానీ నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు . " ఏమైనాసరే .. నా ధ్యానశక్తితోనే నా సమస్యలను పరిష్కరించుకోవాలి " అని గట్టిగా నిర్ణయం తీసుకుని ప్రతిరోజూ ఉదయం 4.00 గం|| ల సమయంలో రెండు గంటల పాటు ధ్యానం చేయడం మొదలు పెట్టాను. రెండు రోజుల తరువాత గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఒక దివ్య అనుభవం వచ్చింది.

ఆ అనుభవంలో .. నా భౌతిక శరీరం ఒక అడవిలోని బండపై పడుకోబెట్టిబడి ఉంది. ఒక ఆజానుబాహుడైన " యోగి " నా తల దగ్గర నిలుచుని నన్ను పరిశీలిస్తూన్నాడు. నా సూక్ష్మశరీరం ఆ ప్రక్కనే నిలబడి జరుగుతోన్న కార్యక్రమాన్ని స్పష్టంగా చూస్తోంది. ఆ " యోగి " తన రెండు చేతులతో .. మెడికల్ పరిభాషలో నా రీనల్ సిస్టమ్ నుంచి గాస్ట్రో ఇంటస్టెయినల్ ఒక అసాధారణమైన కనెక్షన్ పెట్టారు. ఆ తరువాత నా నడుమును తట్టి .. నా కడుపు వైపు వేలితో గీతగీయగా నా కిడ్నీలో ఉన్న రాయి మెల్లిగా కదులుతూ నా పొట్టలోకి రావడం సూక్ష్మశరీరంలో వున్న నేను స్పష్టంగా చూసి ఆశ్చర్యపోయాను.

ఆ తరువాత ఆ " యోగి " తన రెండు చేతులను దోసిలిలా పట్టి నాతో వాంతి చేయించి .. అందులోని ఒక రాయిని తీసి నాకు చూపించాడు . " ఇందిరమ్మా , ఈ రాయి అన్నదే ఇన్ని రోజులూ నిన్ను బాధపెట్టింది " అని చెప్పి మాయం అయ్యాడు .

ధ్యానంలోంచి బయటికి వచ్చాక నాకు అంతా కలలా అనిపించింది. తరువాత CT స్కాన్ చేయించుకోగా అందులో రెండు కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉండి " నార్మల్ " అని రిపోర్ట్ వచ్చింది. అది చూసి మా యూరాలజిస్ట్ కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు . నా ధ్యానానుభవం విని .. " మెడికల్ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం " అని తన ఆశ్చర్యాన్ని తెలియజేసారు.

ధ్యానంలో అద్భుత సర్జరీ చేసిన ఆస్ట్రల్ మాస్టర్స్ ని నా దివ్యచక్షువుతో చూసిన నేను .. డాక్టర్గా నా జన్మ ధన్యం అయ్యిందని సంతోషించాను.

 

Dr. ఇందిర
హైదరాబాద్
M.D., DGO

సెల్ : +91 9440329097

Go to top