"శొంటికొమ్ము మన 'సారు'వాడు"

 

"పత్రిసారును సరిగా అర్ధం చేసుకున్నాం" అని ఎవరైనా అంటే వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోలేదని చెప్పొచ్చు. ఎవరైనా, "వారు మాకు సరిగ్గా అర్ధం కావటం లేదు" అని వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకున్నారని చెప్పొచ్చు.

గురువు చెప్పేదాని మీద శ్రద్ధ కుదరాలంటే గురువు పట్ల భయభక్తులు తప్పక ఉండితీరాల్సిందే. అంటే, భయం, భక్తీ, సమపాళ్ళలో ఉండాల్సిందే. ఎక్కువా కాదు. తక్కువా కాదు.

అయితే అక్కడక్కడ పత్రిసారును బొత్తిగా "దుర్వాసుడి"లాగా ఎందుకు చిత్రీకరించడం జరుగుతోంది? ఆయన అత్యుత్తమ స్థితిలో ఉన్న ఒక పూర్ణాత్మ. కనుక మనం వారిని గురించి ఎలా చిత్రీకరించినా పట్టించుకోని ఉన్న స్థితి వారిది. మనం మనకోసం విచారశుద్ధి జరపాలి కదా.

పత్రిసార్‌కి అత్యంత సన్నిహితులయిన ఒకామె తేలుకుట్టి నరకం అనుభవిస్తూ ఉంటే కనీస సానుభూతి కూడా చూపించకుండా, "నీ చావు నువ్వే చావు. లేదా ధ్యానం చేసి నొప్పి తగ్గించుకో: అని నిర్ధాక్షిణ్యంగా చెప్పిన కఠినాత్ముడాయన. ఆయనకు "సన్నిహితులు" అని మనం అనుకోవడం తప్ప, నిజానికి ఆయన అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తి. ఆనాటి బాధితురాలు ఎవరో కాదు; ఈనాటి గ్రాండ్ మాస్టర్ మేడమ్ స్వర్ణమాలాజీ.

ఇటీవల చార్మినార్ దగ్గర అక్కన్న మాదన్న్ గుడిలో ధ్యాన కార్యక్రమం అయిన తర్వాత ఒక పండు ముదుసలి సారును ఏదో అడుగుతోంది. ఆమెను అక్కున చేర్చుకుని ఎంతో అప్యాయతతో ముసి ముసినవ్వులతో ఆమెను సమాధాన పరుస్తూ ఉండటం చూపరులకు ముచ్చటవేసింది - ఆయన ప్రేమ తత్త్వానికి జోహార్లు.

బుద్ధి చెప్పేవాడు గ్రుద్దితేనేమయా? చాకివాడు మైలతీసి మంచి మడత వేయటం లేదా? మిలారెపా అనే యోగి గురువు మార్పా వద్ద శిష్యరికం చేస్తూ ఉన్నప్పుడు ఎంత నరకమనుభవించాడో ఆ కథ చదివిన మనందరికీ తెలుసు. అయితే ఆ గురువుకే తెలుసు ఈ శిష్యుని సంస్కారవాసనలు ఎలా అయితే శుద్ధి అవగలవో.

ప్రఖ్యాత రష్యన్ గురువు ఒకాయన - గుర్డ్యీఫ్ చండశాసనుడు. ఆయన ఫోటో చూస్తేనే ఒక గూండానూ చూసినట్టుగా శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది. నమ్మకం లేకపోతే మన "పిరమిడ్ లైట్" మాస పత్రిక May-June 2000 కవర్ ఫోటో చూడండి. దీనికి పూర్తిగా భిన్నమైనది - పత్రిసారు బ్రహ్మవర్చస్సు. ఇటీవల L.B. నగర్ ధ్యాన వేదికపై ఒక వ్యక్తి శిఖామణి" రవీంద్రనాడ్ ఠాగూరు అంత అందంగా ఉంటారు పత్రిసారు" అన్నమాట. "పత్రిసారు హంసామోహన రూపాయ" అని గదా మనం మనదేవుడికి ఇచ్చిన టైటిల్.

శొంటి గంధం ఒక క్షణం భగ్గుముంటుంది. మరుక్షణం మంచిగా చల్లగా అయిపోతాయి కళ్ళు. అంటే కాఠిన్యం, కనికరం సృష్టిలో ఒకే నాణానికి రెండు ప్రక్కలేమో.

 

నేమాని వెంకటరమణ
కార్ఖానా
సికింద్రాబాద్

Go to top