"ధ్యానం ప్రచారం చేయడానికే జన్మించాను"

 

నా పేరు మాలిక.

నేను ఏడవ తరగతి సెయింట్ పీటర్స్ హైస్కూల్ లో చదువుతున్నాను.
నేను మూడేళ్ళుగా ధ్యానం చేస్తున్నాను. నేను ఒకరోజు రాత్రి మొదలుపెట్టి మరుసటిరోజు ఉదయం వరకూ ధ్యానం చేసాను. అప్పుడు నాకు ఒక మెస్సేజ్ వచ్చింది: నన్ను నా గతజన్మలో ఒకరు చంపేశారు. దాని తర్వాత, 'మనిషి అసలు ఎందుకు పుట్టాలి?;' 'మనిషి ఎందుకు మరణించాలి?'; 'మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది?' - అన్న విషయాలను ఎంతో పరిశీలించి. ధ్యానం చాలా గొప్పదని తెలుసుకుని "ఈ జన్మలో ధ్యానప్రచారం చేయడానికి వచ్చాను." అని తెలిసింది.

మరొకసారి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా సూక్ష్మశరీరం రిలీజ్ అయినట్లు అనిపించింది. నాకు అప్పుడు "సూక్ష్మశరీరం అంటే ఏమిటి? అసలు ఎక్కడ ఉంటుంది? ఎందుకు రిలీజ్ అయ్యింది?" అన్న విషయాలు ఏవీ తెలియవు. తర్వాత దానిలోకి ఒక వెలుగు వచ్చింది. అది ఒక చీకటి ప్రదేశానికి వెళ్ళింది. తర్వాత ఆ వెలుగు మాయమైపోయి అక్కడ ఒక తను దీపం వెలిగిస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఆ ప్రదేశమంతా వెలుగుమయం అయ్యింది. అప్పుడు అక్కడ అద్భుతమైన శిలలు కనిపించసాగాయి. తర్వాత ఆ శిలలు శిల్పాలుగా దేవుళ్ళు రూపంలో కనిపించాయి. తర్వాత వాళ్ళంతా నాట్యం చేస్తూ కనిపించారు. ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా అనుభవాలు కలిగాయి.

నాకు ఐ-సైట్ ఉందని, మా నాన్న పత్రిసార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పత్రిసార్ నన్నుకళ్ళకు గంతలు కట్టుకుని మూడురోజులు వరుసగా ఒక చీకటిగదిలో ధ్యానం చేయమని చెప్పారు. అలా నేను చేసిన తర్వాతా నా ఐ-సైట్ మొత్తం తగ్గి నేను ఇప్పుడు అసలు కళ్ళజోడు లేకుండానే అన్నీ చదవగలుగుతున్నాను.

అలా ధ్యానం చేస్తున్న మూడు రోజులలో, మొదటిరోజు నా కళ్ళలోకి ఎనర్జీ బాగా వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత ఒక భయంకరమైన అడవిలో దెయ్యాలు అరుస్తున్నట్టూ, నా ముందుకు వచ్చినట్టూ అనిపించింది. ఆ రోజుతో నాలో ఉన్న భయం అంతాపోయింది. ఆ తర్వాత పత్రిసార్ వచ్చి నా కళ్ళు పీకేసినట్లు అనిపించింది. రెండవరోజు నాతోపాటు ఆ గదిలో ఈ ప్రపంచంలో సైట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళంతా కూర్చుని ఉన్నట్టూ, పత్రిసార్ మా అందరితో ధ్యానం చేయిస్తున్నాట్టూ, ఈ లోకంలో ఉన్న మాస్టర్స్ అందరూ వచ్చి మా అందరికీ ఎనర్జీస్ ఇచ్చి మా సైట్ ప్రాబ్లమ్ తీసేస్తున్నట్టూ అనిపించింది. ఆ తర్వాత నా కళ్ళు విపరీతంగా దురద పెట్టసాగాయి. ఇది ఏమటని మా నాన్నగారిని అడిగితే "అది హీలింగ్ ప్రాసెస్" అని చెప్పారు. మూడవరోజు ఈ లోకం అంతా ధ్యానమయం అయినట్టూ, పత్రిసార్ అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టినట్టూ, అందరి నుంచి నాకు విపరీతమైన ఎనర్జీ వచ్చినట్టూ అనిపించింది. ఆ తర్వాత నాకు విపరీతంగా దురద పెట్టసాగింది. అది తట్టుకోలేని విధంగా మారింది. అయినా కాని నేను ధ్యానంలో నుంచి లేవకుండా అలాగే కూర్చుని నా సైట్ పూర్తిగా తగ్గించుకోగలిగాను.

నా లాగే మీరు కూడా ధ్యానం చేసి ఏ రోగాలనైనా తగ్గించుకోవచ్చు.

 

 

పిరమిడ్ మాస్టర్ బేబీ మాలిక
D/o. మారం శివప్రాద్
కార్ఖానా
సికింద్రబాద్

Go to top