"అందరికీ ధ్యానం నేర్పుతున్నాను"

 

నా పేరు భాగ్యమ్మ.

నేను 2002 నవంబర్ 17వ తేదీ నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు వీపనగండ్ల పిరమిడ్ మాస్టర్ కోటేశ్వర్ గుప్త గారు ఈ ధ్యానాన్ని పరిచయం చేసారు. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నేను చిన్నతనం నుండి చాలా ఎక్కువగా భక్తిభావన కలిగి ఉండేదాన్ని. బైబిల్‌తో పాటుగా రామాయణ, భారతాల పట్లా, అలాగే ఖురాన్ పట్లా ఆసక్తిని కలిగి వుండి, ఏ ఏ గ్రంథాలలో ఏం చెప్పబడిందో తెలుసుకోవాలనే తపన కలిగి ఉండేదాన్ని. అయినా నాలో ఏదో కొరత ఉండేది. ఇలాంటి సందర్భంలో నాకు ఈ ధ్యానం పరిచయం అయింది.

ఈ ధ్యానం ప్రారంభించే నాటికి నేను శారీరక అనారోగ్యంతోనూ, మానసికంగా ఏదో తెలియని అశాంతి తోనూ వున్నాను. నా ఆరోగ్యం బాగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ధ్యానం ప్రారంభించాను. ప్రారంభంలో పది నిమిషాలు, ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తూ క్రమక్రమంగా సమయం పెంచుకుంటూ ప్రస్తుతం ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం చేస్తున్నాను. దాదాపు రెండు సంవత్సరాలుగా నయం కాని నా ఆరోగ్యం పూర్తిగా నయం అయ్యింది. నాలో ఉండే కోపం, గర్వం విసుగూ అన్నీ పోయాయి.

ఇప్పుడు 'ఇంటింటి ధ్యానం' ప్రారంభించి గ్రామ గ్రామాలలో ధ్యానప్రచారం చేస్తున్నారు. నా స్నేహితులకూ, బంధువులకూ అందరికీ ధ్యానం నేర్పుతున్నాను. నేను ఒక గృహిణిగా ఉంటూనే ఒక స్కూల్‌కి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా రోజు ధ్యానం చేస్తూ, అందరికీ ధ్యానం నేర్పుతున్నాను. ఇంకా ధ్యానసాధన సమయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను.

 

S.భాగ్యమ్మ
W/o. ప్రేమయ్య
కొత్తకోట, మహబూబ్‌నగర్

Go to top