"ధ్యానం నా జీవితంలో గొప్ప మలుపు తెచ్చింది"

 

నా పేరు ఛోటీ.

నేను కేరళలో ఒక ఆధ్యాత్మిక సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను.

మా కుటుంబంలోని ఏడుగురు పిల్లల్లో నేను అయిదవదాన్ని. నేను ఎప్పుడూ అనారోగ్యంతో వుంటూండడం వల్ల నాపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేవారు. నా తల్లిదండ్రులు చాలా విశాల హృదయులు, విశాల దృక్పధం గలవారు. అయినా చాలా క్రమశిక్షణతో పెంచారు. మేము ఆదివారాలూ, మరి పండుగ రోజులలో తప్పక చర్చికి హాజరయ్యేవారం. చర్చి నియమాల ప్రకారం ఉపవాసాలు ఉండేవాళ్ళం. చర్చి నియమాల ప్రకారం ఉపవాసాలు ఉండేవాళ్ళం. విందులకు హాజరయ్యేవాళ్ళం. మతగురువులూ, నన్స్ మా ఇంటికి ఎక్కువుగా వచ్చేవాళ్ళు. పిల్లలమైన మేము, మా తల్లిదండ్రులూ ఆ మతగురువులూ బైబిలులోని అంశాలు చర్చించేటప్పుడు ఆసక్తితో వినేవాళ్ళం.

ఓ చిన్నపిల్లగా 'జీసస్' అంటే చాలా భయపడేదాన్ని. ఎందుకంటే మరణానంతరం జీసస్ తీర్పు చెప్పేరోజు వచ్చి ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలనుసారం అవి మంచివైతే పురస్కరించడం చెడ్డవైతే శిక్షించడం జరుగుతుందని నమ్మేదాన్ని. " 'శిక్ష' అంటే నరకంలో మంటలలో పడేసి దగ్ధం చేయటం" అని మతగురువులు ప్రభోధించేవారు. నేను పెద్దదాన్ని అయిన తరువాత నా అవగాహనతో "జీసస్ అంత క్రూరుడు కాదు" అని తెలుసుకున్నాను.

నా ఇద్దరు అక్కలూ హిందువులను వివాహం చేసుకున్న తరువాత, వాళ్ళు హిందూ మతధర్మాలను పాటిస్తూనే క్రైస్తవాన్ని కూడా అవలంబించేవారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నాలో చాలా మార్పులకు దోహదం అయ్యింది. మా అక్క వాళ్ళ హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడంతా రంగులమయంగా కళ కళలాడుతూ వుండడం నాకు బాగా నచ్చేది.

నాకు పెళ్ళి ఒక సాంప్రదాయ ప్రొటెస్టెంట్‌తో జరిగింది. ఆయన మత నిబంధనలను చాలా నియమంగా ఆచరిస్తారు. ఈ రకమైన మతపరమైన విశ్వాసాలూ, నమ్మకాలూ నన్ను కలవరపెట్టాయి.

ప్రశాంతత కొరకు "మహర్షి మహేష్ యోగి గారి "ట్రాన్సెన్‌డెంటల్ మెడిటేషన్", "చిన్మయానంద మిషన్", "అరబిందో ఆశ్రమం", "ఆర్ట్ ఆఫ్ లివింగ్", "రేకీ" ... ఇలా ఎన్నింటినో ఆశ్రయించాను. అవేవీ నాలో ఎటువంటి మార్పునూ తేలేదు.

జనవరి 1998 లో మా అక్క ప్రొద్బలంతో, బ్రహ్మర్షి పత్రీజీ గారిచే నిర్వహించబడుతున్న ఒక 'ధ్యాన శిక్షణ క్లాసు' కు వెళ్ళాము. అప్పటి నుంచి నా జీవితం ఒక మలుపు తిరిగింది - చిట్ట చివరికి నా గురువు గారిని చేరగలిగాను.
"ఆనాపానసతి" ధ్యానం నా ఆలోచనా స్రవంతిలో పెనుమార్పులు తెచ్చి నా జీవితానికే ఒక క్రొత్త ధ్యేయాన్ని చూపించింది. నా ధ్యానానుభవాలు చాలా వున్నాయి. చిన్నతనం నుంచీ వేధిస్తూన్న "ఫెవ్‌టిక్ అల్సర్" మటుమాయమైంది. నేను గత ఆరు సంవత్సరాలలో డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదు. నేను ప్రతి మనిషి యొక్క, ప్రతి వస్తువు యొక్క ఆరా చూడగలిగాను. ధ్యానంలో మొట్టమొదటిగా షిరిడీ సాయిబాబానూ, ఆ తరువాత అనేకమంది మాస్టర్లనూ, వేంకటేశ్వర స్వామినీ చూశాను. ఆత్మలతో నా అనుభవాలు చాలా వున్నాయి.

ధ్యానం తర్వాత కలిగిన పరిణితితో, "జీసస్ ఆకాశంలో సింహాసనం పై కూర్చుని, మానవులకు తీర్పు చెప్పేవాడు కాదు" అని తెలుసుకున్నాను. "మానవులను, భయపెట్టే సందేశాలతో బాధించవద్దు." అని మతాధికారులకు చెప్పాలనిపించింది.
నా బాల్యంలోని భయాలూ, ఆటంకాలూ దూరమైపోయాయి. నేను చర్చికి వెళ్ళినప్పుడు కానీ, కూర్చుని ధ్యానం చేసేటప్పుడు కానీ నేను జీసస్‌తో చెప్తాను - "నేను ఒక గొప్ప మాస్టరును కలిసే అవకాశం దొరికింది. ఆయన ప్రబోధాలన్నీ మీ ప్రబోధాలుగానే ఉన్నాయి. ఆయన పేరు సుభాష్ పత్రి గారు" అని.

 

చోటి సైమన్
తిరుమలగిరి
సికింద్రాబాద్

Go to top