" మా అమ్మాయి 'సైట్' ప్రాబ్లమ్ పత్రిగారి చిన్ని సూచనతో పోయింది "

 

నా పేరు చంద్రకుమారి.

మేము అదోని మాస్టర్ ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చాము. మొదట్లో మా వారు ఒక్కరే ధ్యానం చేసేవారు. నేను పది నిమిషాలే చేసేదాన్ని. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. జూన్ 2000 సంవత్సరంలో సికింద్రాబాద్ వాసవీనగర్‌లో M.నిర్మల మేడమ్ పరిచయం, ఇక్కడ జరిగే ధ్యానం కార్యక్రమాలు చూసి నాకు బాగా ధ్యానం చెయ్యాలనిపించేది. కానీ ఈ ఊరికి వచ్చే ముందు ఏదో భయం, "సిటీకి వస్తున్నాను, నాకు ఎవ్వరూ తెలియదు, ఎలా ఉంటానో అని నాకు మా అమ్మావాళ్ళకు చాలా భయంగా ఉండేది. నాకు మొదటినుంచీ ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వెళ్ళి ఏదో చెయ్యాలని అనిపించేది. కానీ ముందుకు వెళ్ళి ఏదీ చేయగలిగే నేర్పూ ధైర్యం లేదు. లోపల వచ్చే భావాలను ఆచరణ లేదు.

ధ్యానంలోకి వచ్చిన తరువాత నలుగురిలో మాట్లాడగలిగే మార్పు వచ్చింది. దానికి నేను ఎంతో సంతోషపడి అదే ఆనందంలో ఉన్న తరుణం నాలో ఒక వింత స్పందన - "ఇంతేనా, కాదు, ఇంకా తెలుసుకోవలసింది ఉంది." అని అప్పటినుంచి ఆత్మజ్ఞాన ప్రయాణం మొదలైంది. దాని తరువాత ఎన్నో చెప్పలేని మార్పులు. ప్రతిరోజూ ప్రతి విషయం నుండీ ఎంతో నేర్చుకుంటున్నాను. ఇలా ఉండగా మా అమ్మాయి సైట్ ప్రాబ్లమ్ పత్రిగారి చిన్ని సూచనతో పోయింది. నాకు చాలా సంతోషంగా ఆనందంగా వుంది. కంటిచూపు సరిగ్గా లేక అది పడే బాధ చూడలేక పోయేదాన్ని.

ఒక డాక్టర్ సైట్ ఎక్కువుగా ఉన్న కన్నుకు ఒక రబ్బరు ఇచ్చి, అమ్మాయి ఇంట్లో ఉన్నంతసేపూ ఆ కంటికి అది పెట్టి అద్దాలలోంచి చూడమన్నారు. ఇంకో డాక్టర్ ఇలా అద్దాలు వాడుతూ వుంటే "ఆ కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది; 'లెన్స్' వాడండి." అని చెప్పారు. కానీ మా అమ్మాయి లెన్స్ వాడలేకపోయింది. ధ్యానం చెయ్యమంటే పది నిమిషాలే చేసేది. ఎంత చెప్పినా వినేది కాదు. అందుకని నేను "కొద్దిరోజులు దీని గురించి ఆలోచించడం మానివేయడం మంచిది" అనుకున్నాను. "మనం ధ్యానం చేస్తున్నాం మనకు ఏదో ఒక సరైన మార్గం దొరుకుతుంది." అని అనిపించింది. అయితే మా అమ్మాయికి గ్లాసెస్ పగిలి రిపేర్‌కి ఇస్తే వాళ్ళు కొద్దిగా టైమ్ తీసుకుంటారు కదా ఆ ఒక్కరోజు కూడా అద్ధాలులేకుండా ఉండలేకపోయేది. కళ్ళు ఎర్రగా అయి నొప్పిగా వుంటూ నీళ్ళు కారేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి తరుణంలో మావారు గురువు గారైన 'బ్రహ్మర్షి పత్రీజీ' గారికి తెలియజేయడం మాకు ఆయన ఒక వరం లాంటి గొప్ప ఆచరణ మార్గం చూపించారు.

"మనస్సుంటే మార్గం వుంటుంది" అన్న విధంగా మనకు జ్ఞానం కావాలని ఉంటే మాస్టర్స్ ఏదో విధంగా అందిస్తారన్న సత్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నాను.

మేం ఇలాగే ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన మార్గంలో ప్రయాణించాలన్నదే మా కోరిక. మమ్మల్ని ప్రతినిత్యం చిన్న పిల్లలుగా గమనించి ఎప్పటికప్పుడు సరిదిద్ది సత్యాన్ని తెలియచెప్తున్న పత్రిగారికి ఏం చేసినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నన్ను సార్ వ్రాయమన్నప్పుడు ఎలా వ్రాయాలో అర్ధం కాలేదు. రెండు సార్లు వ్రాసాను కానీ అది నచ్చలేదు. అయితే సార్ చెప్పినట్లు సింపుల్‌గా వ్రాయాలని అనిపించింది. నేను ఎలా వ్రాసానో నాకే తెలీదు.

 

M.చంద్రకుమారి
W/o మారం శివప్రసాద్
సికింద్రాబాద్

Go to top