"కళ్ళద్దాలు లేకుండానే అన్నీ స్పష్టంగా చూస్తున్నాను"

 

నా పేరు మణిదీపిక.

నేను నాల్గవ తరగతి చదువుతున్నాను. నేను 2000 సంవత్సరంలో ధ్యానం చేయటం మొదలుపెట్టాను. మొదటి ఐదు రోజులలో నాకు కలర్స్ కనపడ్డాయి. తరువాత పది రోజులకు చాలామంది దేవతలు కనపడ్డారు. దాంతో పాటు ఒకరోజు నాకు థర్డ్ ఐ 'ఓపెన్' అయ్యింది. అప్పుడు నేను 'ఆస్ట్రల్ ట్రావెల్' చేశాను. ఎన్నో బిల్డింగులూ, మనుషులూ, సముద్రం ఇంకా చాలా చూశాను. తరువాత కొన్ని రోజులకు కళ్ళు మంటలుగా ఉండటం వల్ల నేను కళ్ళద్దాలు పెట్టుకోవడం జరిగింది. నాకు ఐ పవర్ '7' ఉంది, అది పెరుగుతూ '8' కి వచ్చింది.

సోడా బుడ్డి అద్దాలు పెట్టుకునే దాన్ని. ఈ సమయంలో పత్రిసార్ చెప్పిన ఒక పద్ధతి వల్ల నా కళ్ళు రెండూ పూర్తిగా బాగైపోయాయి. ఇప్పుడు కళ్ళజోడు లేకుండానే అన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నాను.

2003 సెప్టెంబర్ లో '7' పాయింట్ సైట్ వున్న నేను ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను.

నేను మా అమ్మ, నాన్నల వెంట దసరా సెలవుల్లో వైజాగ్, పూరి వెళ్ళాను. పూరీలో "యుక్తేశ్వరగిరి" స్వామి సమాధి దగ్గర అరగంట ధ్యానం చేశాం. అక్కడ నాకు ప్రపంచం మొత్తం ధ్యానప్రపంచం అయినట్లు కనపడింది. అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది.

 

బేబీ M. మణిదీపిక
D/o మారం శివప్రసాద్
సికింద్రాబాద్

Go to top