" ధ్యానం చేస్తే ఏ సమస్యనైనా అదిగమిస్తాం "

 

నా పేరు విఠల్ ప్రసాద్.

నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.

కొన్ని అనుకోని పరిస్థితులలో నేను బాగా డిప్రెషన్‌కు లోనయ్యాను. ఆ సమయంలో పత్రిసార్ మూడురోజులు పూర్తిగా ధ్యానం చేయమని ఆదేశించారు. పత్రిసార్ చెప్పిన రోజే నేను ఇంటి నుంచి బయలుదేరి కర్నూల్ "బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి" కు వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఉదయాన్నే పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

మధ్యాహ్నం వరకూ ధ్యానం చేశాను. ఎప్పుడూ ఒంటరిగా ఉండే అలవాటు లేక, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాను. ఇక ఉండలేనని అనిపించి అమ్మకు ఫోన్ చేసి "నేనిక్కడ ఉండలేను తిరిగి వచ్చేస్తాను." అని చెప్పాను. అమ్మ "మొదటిసారి కాబట్టి అలాగే ఉంటుంది కానీ ప్రయత్నిస్తే ఏదైనా చేయగలవు. ధ్యానం అంటే ఏదో కూర్చోవడం కాదు. సరైన అవగాహన ఉంటే నీకలా అన్పించదు. మళ్ళీ ప్రయత్నించు" అని చెప్పింది. అది విన్నాక నాలో పట్టుదల వచ్చింది. ఏమైనా సరే మూడురోజులూ ధ్యానం చేయాలని నిర్ణయించుకొని మళ్ళి ధ్యానం మొదలుపెట్టాను. రెండవరోజు కూడా పిరమిడ్‌లో పూర్తిగా ధ్యానంలో గడిపాను. సాయంత్రం అక్కడ జరిగిన పౌర్ణమి ధ్యానంలో పాల్గోన్నాను. ఆ ధ్యానం నాకు చాలా ఉపయోగపడింది. తరువాత మళ్ళీ వెళ్ళి పిరమిడ్‌లో కూర్చున్నాను. అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిసారిగా నాకు నా పూర్వజన్మలు తెలుసుకోవాలని అన్పించింది. వెంటనే నా సూక్ష్మశరీరం నా వెనకటి జన్మలోకి ప్రయాణించడం జరిగింది.

కర్నూలు నుండి వచ్చిన తరువాత ప్రశాంతంగా ఉంది. మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు లేవు. డిప్రెషన్ పూర్తిగా పోయింది. పత్రిసార్‌ని కలిసి ఇదే విషయం చెప్పాను. పత్రిసార్ "ధ్యానం చేయడం వలన మనం ఏమైనా పొందగలం, ఏ సమస్యనైనా అధిగమించగలం" అని చెప్పారు.

ఇక చక్కగా చదువుకోవడం, వీలైనంతమందికి ధ్యానం గురించి చెప్పడం - ఇదే నా ప్రస్తుత నిత్యకృత్యం.

 

M. విఠల్ ప్రసాద్
S/o మారం శివప్రసాద్
కార్ఖానా, సికింద్రాబాద్

Go to top