" ధ్యానం ద్వారా నేను నా నడుము నొప్పి తగ్గించుకున్నాను "

 

నా పేరు ఆలీ. వయస్సు 23 సంవత్సరాలు. 2001 సంవత్సరంలో సీనియర్ మాస్టర్ P. సతీష్ గారి ప్రోత్సాహంతో ధ్యానంలో ప్రవేశం జరిగింది. మొట్టమొదటిసారిగా పౌర్ణమి ధ్యానం చేశాను. కానీ తరువాత కొన్ని కారణాల వలన ధ్యానం చేయడం మానివేశాను.

నాకు ఆరు సంవత్సరాల నుండి బ్యాక్ పెయిన్ ఉండేది. ఆరు సంవత్సరాల నుండి ఉన్న నొప్పిని ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. తరువాత ధ్యానం మానేసిన వెంటనే విపరీతమైన నొప్పి మొదలైంది. పూర్తిగా ఎనిమిది నెలలు నొప్పితో బాధపడ్డాను. ఒకరోజు సీనియర్ మాస్టర్ వాణి గారు కలిసి మళ్ళీ ధ్యానం మొదలు పెట్టమని ప్రోత్సహించడంతో మొదలుపెట్టాను. మూడు నెలలు కాలంలో యాభైశాతం నొప్పితగ్గింది. ఆ తరువాత Dr. గోపాలక్రిష్ణ గారితో కలిసి మాట్లాడటం జరిగింది. ఆ తరువాత ప్రతివారం లైఫ్ కౌన్సిలింగ్ ద్వారా నా నడుమునొప్పిని పూర్తిగా తగ్గించుకున్నాను.

ఇప్పుడు నేను మాంసం, మరి మందులు పూర్తిగా మానివేశాను. ధ్యానం ద్వారా నేను నా నడుము నొప్పి తగ్గించుకున్నాను. ప్రస్తుతం ఇప్పుడు Health Clinicలో లైఫ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ నాకు తోచిన సహాయం చేస్తున్నాను.

ధ్యానంలో ప్రవేశించిన తరువాత నా చిరకాల వాంఛ అయిన పుస్తక పఠనం మరి TV ఛానెల్ వారితో మాట్లాడటం పూర్తి అయింది.

 

ఆలీ
విశాఖపట్టణం

Go to top