" లైఫ్‌లో మంచి స్థితిలో స్థిరపడగలననే నమ్మకం కలిగింది "

 

నా పేరు చాముండేశ్వరి. నా వయస్సు 18 సంవత్సరాలు. మాది వేపగుంట. నేను ఆరు నెలలుగా ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చెయ్యకముందు చాలా ప్రాబ్లమ్స్ తో ఉండేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తరువాత ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి.

ముఖ్యంగా ఎక్కువ ఆలోచనలతో, మానసిక వొత్తిడి, అనారోగ్యం ఉండేవి. ధ్యానం ద్వారా సమస్యల పరంగా టెన్షన్ తగ్గి వాటిని పరిష్కరించుకునే ఆలోచనాశక్తి పెరిగింది. నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తరువాత నాలో ఉన్న ధైర్యం ఆత్మస్థైర్యంగా మారింది.

ధ్యానం అనే పునాదిని వేసుకున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఇంటర్మీడియట్ చదువుకోవాలని ఉండేది. నాకోరిక తీరదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తరువాత మళ్ళీ నేను బాగా చదువుకుంటున్నాను. లైఫ్‌లో మంచి స్థితిలో స్థిరపడగలననే నమ్మకం కలిగింది. అందుకే అందరూ ధ్యానం చేయండి. ఆనందంగా జీవించండి.

చాముండేశ్వరి
విశాఖపట్టణం

Go to top