" నేను శారీరకంగానూ, మానసికంగానూ, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను "

 

నా పేరు పద్మకుమారి. వయస్సు 30 సంవత్సరాలు. ఫిబ్రవరి 2003 నుండి Dr. గోపాలకృష్ణ గారి దగ్గర ట్రీట్‌మెంట్ మొదలుపెట్టిన తరువాత ధ్యానం శ్రద్ధగా చేస్తున్నాను.

నాకు కడుపునొప్పి ఎక్కువగా వచ్చేది. ఈ బాధ భరిచలేక లేడి డాక్టర్‌కు చూపించుకుంటే ఆపరేషన్ చేయించుకోవాలి; ప్రేగుమీద కాయ ఉంది; గర్భసంచి తీసివేయాలి అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత మరికొన్ని క్రొత్త సమస్యలు వస్తాయి అని తెలిసి ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేక హోమియో మెడిసిన్ ఆరు నెలలు వాడాను. వాటి వలన కూడా ఫలితం కనిపించలేదు.

నాకు ఈ కడుపునొప్పితో పాటు ఆస్తమా, అధిక బరువు అనేక సమస్యలు కూడా ఉండేవి. "ఈ సమస్యలన్నింటికీ ధ్యానం ఒక్కటే మార్గం" అనిపించి "మెడిటేషన్ హెల్త్ క్లినిక్"లో Dr.G.K. గారి దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలు పెట్టాను.

ట్రీట్‌మెంట్ మొదలైన ఏడు నెలలు తరువాత తొమ్మిది కేజీలు బరువు తగ్గాను. ప్రస్తుతం నేను ఆస్తమాకు ఎటువంటి మెడిసిన్ వాడడం లేదు. పీరియడ్స్‌లో వచ్చే కడుపునొప్పి కూడా క్రమంగా తగ్గుతోంది. ఈ ధ్యానం ద్వారా ట్రీట్‌మెంట్ తీసుకున్న తరువాత నేను శారీరకంగానూ, మానసికంగానూ, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను.

 

పద్మకుమారి
విశాఖపట్టణం

Go to top