" నేను ధ్యానంలోకి వచ్చిన తరువాత కోపం, భయం పూర్తిగా తగ్గాయి "

 

నా పేరు M. శ్రీనివాసరావు. నేను ధ్యానం మొదలుపెట్టి రెండు నెలలు అవుతుంది. ధ్యానం చేయకముందు ఎక్కువ కోపం ఉండేది. అలాగే ఎక్కువ భయం కూడా ఉండేది. నేను ధ్యానంలోకి వచ్చిన తరువాత కోపం, భయం పూర్తిగా తగ్గాయి.

ధ్యానం మొదలుపెట్టిన తరువాత శరీరపరంగా వచ్చిన అనుభవాలు వెన్నులో ఎక్కువుగా నొప్పిరావటం, కీళ్ళలో నొప్పిరావటం, గుండెలో నొప్పిరావటం, నరాలు పీకినట్లు ఉండటం, శరీరం తేలికగా అయిపోవటం కడుపులో మంటలు రావటం ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవాలు అలాగే ధ్యానం కంటిన్యూ చేస్తూంటే ఇవన్నీ తగ్గిపోయాయి. ఎక్కువుగా ఆకలి వేయటం, తొందరగా జీర్ణం అయిపోవటం ధ్యానంలోకి వచ్చిన తరువాత జరిగింది.

 

M. శ్రీనివాసరావు
విశాఖపట్టణం

Go to top