" నేను ధ్యానం శ్రద్ధగా చేస్తున్నాను "

 

నా పేరు విజయలక్ష్మి. మాది వేపగుంట ధ్యానం చెయ్యకముందు నాకు వెన్నెముకలో బాధ ఉండేది. అందువల్ల ఏడు నెలలు పూర్తి విశ్రాంతిలో ఉండమన్నారు. 90 ఇంజెక్షన్లు చెప్పారు. నాకు 70 ఇంజెక్షన్లు ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు G.K. గారు వచ్చి నాకు ధ్యానం గురించి చెప్పి పది నిమిషాలు ధ్యానం చేయించారు. తర్వాత రోజూ చెయ్యమని చెప్పారు. నేను రోజుకి మూడు, నాలుగు గంటల ధ్యానం చేసేదాన్ని. అలా ఒక వారం చేసేసరికి లేచి కూర్చోగలిగాను. అలా నలభైరోజులు చేసేసరికి నాకు ఎక్సరే తీసారు. ఎక్సరేలో ముందు కనిపించిన అనారోగ్యం లేదని తెలిసింది. ఇప్పటికి నేను ధ్యానం చేయటం మొదలుపెట్టి నూరు రోజులు అయిపోయింది. ఇప్పుడు కొంచెం బాధ ఉంది. నేను ధ్యానం శ్రద్ధగా చేస్తున్నాను.

  • నాకు ధ్యానంలో శ్రీ కృష్ణుడి పాద నమస్కారం దొరికింది.
  • ఈశ్వరుడు కనిపించాడు; పర్తిబాబా గారి పాదాలు కనిపించాయి.
  • దీపాలు ఎక్కువుగా కనిపించడం; దీపాలతో ఎవరో తీసుకువెళుతున్నట్లు హారతి కనిపించడం జరిగింది.
  • బ్రహ్మర్షి పత్రీజీ మూడుసార్లు కనిపించారు. అలాగే B. సత్యవతి మేడమ్ గారు నా నడుము మీద చెయ్యిపెట్టి హీలింగ్ పవర్‌తో నొప్పి తగ్గించారు.

 

విజయలక్ష్మి
వేపగంట
విశాఖపట్టణం

Go to top