" శ్వాసే దైవం "

నా పేరు K. సోమేశ్వరమ్మ. నా వయస్సు 58 సంవత్సరాలు. నేను 2003 డిసెంబర్‌లో హైదరాబాద్ విజయపురి కాలనీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మేడమ్ అక్కిరాజు విజయలక్ష్మి గారి ద్వారా ధ్యాన విధానం తెలుసుకున్నాను.

25 సంవత్సరాల నుండి నాకు ఒకే ఊపిరితిత్తు ఉండడం వలన దగ్గు, ఆయాసంతో బాధపడుతుండేదాన్ని; ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. ఎంతో విసిగిపోయి మందుల వాడకం నిలిపివేసాను. విజయలక్ష్మి మేడమ్ ప్రోద్బలంతో రోజూ ఒక గంట ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను.

2004 మే 30వ తేదీన L.B. నగర్ పిరమిడ్ మాస్టర్ సౌమ్యను కలిసాను. అనారోగ్యం ఇంకా తగ్గలేదని అన్నప్పుడు ఆంజనేయుడు తోకను పెంచినట్లు ధ్యానం చేసే సమయం పెంచమని చెప్పారు. అప్పటి నుంచి రోజుకి మూడు సార్లు గంట చొప్పున ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను.

ఇప్పుడు ఆరోగ్యం చాలా వరకూ మెరుగయ్యింది. పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాను. శ్వాసే దైవమని నమ్మాను. మానసిక ప్రశాంతత లభించింది. ధ్యానంతో ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుందన్న నమ్మకం కుదిరింది.

"పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్" సెంటర్‌‍లో పత్రి గారిని మొదటిసారిగా కలవడం జరిగింది. "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నాను. ఇక్కడి ధ్యాన కేంద్రంలో ప్రతి శనివారం L.B. నగర్ పిరమిడ్ మాస్టర్ P.V.S. విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సజ్జనసాంగత్యం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల జ్ఞానం పొందుతున్నాను.

ధ్యానంలో మొదటి మూడునెలల్లో బాబా దర్శనం కలిగింది. శ్రీరామ పట్టాభిషేక చిత్రం కనిపించింది. నదులు, పర్వతాలు మొదలైన ఎన్నో ప్రకృతి దృశ్యాలు కనిపించాయి. ఒకరోజు ధ్యానంలో నది మధ్యన శివలింగం కనిపించింది.

నేను గత ఆరు నెలలుగా నాకు తెలిసినవారందరికీ, నా బంధువులకూ ధ్యానం గురించి చెబుతున్నాను. ధ్యానం వలన ఇతరులు కూడా తమ అనారోగ్యాలను, సమస్యల పరిష్కరించుకోగలగడం చూసి ఎంతో తృప్తి కలుగుతోంది.

మితిమీరిన కోరికలను కోరకుండా, ధ్యానలై ఎవరి అనారోగ్యాలను వారే బాగుచేసుకొని, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కనుక అందరూ ధ్యానం చేసి ధన్యులు కావాలని నా ఆకాంక్ష.

 

K. సోమేశ్వరమ్మ
సాహెబ్‌నగర్, వనస్థలిపురం

Go to top