" జ్ఞాపకశక్తి పెరిగింది "

 

నా పేరు అవినాష్. నేను స్టూడెంట్‌ని. మా ఫాదర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ M. శేఖర్ అయితే గాడ్ ఫాదర్ బ్రహ్మర్షి పత్రీజీ.

మానాన్న గారు ఎందరికో ధ్యానం నేర్పించారు. ఈ క్రమంలో నేనూ ధ్యానం చేయసాగాను. గత ఆరేళ్ళగా ధ్యాన సాధన చేస్తున్నాను. నాలో జ్ఞాపకశక్తి, పట్టుదల పెరిగాయి. శారీరక ధృడత్వం కూడా అలవడింది. సిద్ధార్ధ హైస్కూల్‌లో చదివాను. ఇటీవల జరిగిన 10 వతరగతి పరీక్షలలో ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. 600కు గాను 537 మార్కులు వచ్చాయి.

భవిష్యత్తులో ఏరోనాటిక్ ఇంజినీర్ కావాలని ఉంది. నాకు టీచింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం. ఇప్పట్నుంచే తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా స్వశక్తితో స్వఅర్జనతో నా చదువు ఇతర అవసరాలు తీర్చుకోవాలని వుంది.

ధ్యానం ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఎనలేనిది.

 

M. అవినాష్
B-747, N.G.O.S కాలనీ
వనస్థళిపురం హైదరాబాద్

Go to top