" బిడియం పోయింది "

 

నా పేరు కల్పలత. వయస్సు 14 సంవత్సరాలు. నేను రెండేళ్ళుగా ధ్యానం చేస్తున్నాను. ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు దాకా క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గంట నుండి మూడు గంటల దాక ధ్యానం చేస్తున్నాను.

ధ్యానం చేయకముందు నాకు తలనొప్పి, శరీరంలో నీరసంతో ఎక్కువ పనిచేయలేకపోవటం, ఎక్కువసేపు నిలబడలేకపోవటం ... వంటి రుగ్మతలు వుండేవి.

ఎక్కువ చదవటం, వినటం అన్నవి సరిపడేవి కాదు. తలనొప్పి తగ్గటానికి కంటి అద్దాలు కూడా వాడాను .... కానీ తగ్గలేదు. ధ్యానం చేయటం మొదలుపెట్టాక ధ్యానంలో ఉన్నప్పుడు ముందురోజులలో తలనొప్పి ఎక్కువగా వచ్చేది. ధ్యానం నుంచి లేచిన తరువాత తలనొప్పి గానీ శరీర అలసట కానీ ఏమీ లేవు. అంటే "ధ్యానం ద్వారా శరీర రుగ్మతలు ఏవైనా పోగొట్టుకోవచ్చు" అన్నది నేను స్వంతంగా తెలుసుకున్న సత్యం. కనుక నేను ఈ ధ్యానం గురించి చాలామంది నా మిత్రులకు తెలిపాను. అంతే కాకుండా నాకు ఇతరులతో మాట్లాడాలంటే అంతకు ముందు బిడియంగా ఉండేది. ధ్యానం ద్వారా ఆ భయం కూడా పోయింది.

అంతే కాకుండా జ్ఞాపకశక్తి కూడా నాలో చాలా మెరుగయింది. ప్రతి వ్యక్తినీ అర్ధం చేసుకోవడం, మంచిగా మాట్లాడడం, సమయం వృధా చేయకపోవటం ... అంటే సమయం విలువ తెలియడం ... ఎప్పుడూ ఏదో ఒక పనిలోనో, పాటలోనో లేదా చదివుకోవటమో విశ్రాంతి తీసుకోవటమో చేస్తూంటాను.

నా సందేశం : మనం రోజూ కనీసం ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ధ్యానం, ఒక ధ్యాన పుస్తకాలు చదవటం, ధ్యాన మిత్రులతో ఒక గంట గడపటం అందరూ విధిగా చేయాలి.

 

P. కల్పలత
వీపనగండ్ల
మహబూబ్‌నగర్ జిల్లా

Go to top