" ఆస్త్మా తగ్గింది "

 

నా పేరు నవీన్ కుమార్. వయస్సు 14 సంవత్సరాలు; స్వంత ఊరు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు.

నేను పుట్టుక నుంచీ ఆస్త్మా పేషంట్‌ను. చలికాలంలో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండేది, చాలా ఆయాసపడేవాడిని, మా అత్త రాధారాణి ద్వారా " పత్రిసాయి పిరమిడ్ ధ్యానకేంద్రం " కు చెందిన చంద్రకళ మేడమ్ వద్దకు వెళ్ళి నా పరిస్థితి తెలియచేశాను. " 40 రోజులు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి " అని ఆమె చెప్పింది. రోజూ ఉదయం, సాయంత్రం 2 గంటలపాటు సెంటర్‌లోనే ధ్యానం చేసేవాడిని. అలా 30 రోజుల గడిచేటప్పటికి, 14 సంవత్సరాల నుండి వున్న నా ఆయాసం పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత నా సూక్ష్మశరీరం బయటకు వచ్చి పత్రిసార్‌తో రోజూ ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేది. ఒక్కరోజు పాతాళలోకానికి, ఒకరోజు బ్రహ్మలోకానికి వెళ్ళి అన్నీ చూసి వస్తున్నాను. కైరో లో పిరమిడ్‌ను చూసి వచ్చాను.

ఒకరోజు అదోని ప్రేమనాథ్ మాస్టర్ మా సెంటర్‌కు వచ్చినప్పుడు మా మేడమ్ అన్ని విషయాలు నా గురించి చెప్పింది. అప్పుడు శీ ప్రేమనాథ్ మాస్టర్ " పత్రిసార్‌కూ నీకూ వున్న అనుబంధం ఏమిటో తెలుసుకో " అని నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. అప్పుడు నాకు ధ్యానంలో గత జన్మలో పత్రిసార్, నేను ప్రాణ స్నేహితులం అని తెలిసింది.

 

అర్వేటి నవీన్ కుమార్
ప్రొద్దుటూరు
కడప జిల్లా

Go to top