" ఏదైనా సాధించగలను "

 

నా పేరు నీలిమ. వయస్సు 19 సంవత్సరాలు. నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. నేను 2000 సం|| సెప్టెంబరులో ధ్యానం మొదలుపెట్టాను. నాకు ధ్యానం మొదలుపెట్టిన తరువాత కలిగిన గొప్ప అనుభవం ఏమిటంటే నేను మూడు సంవత్సరాల నుండి ఒక మందు కూడా వేసుకోలేదు. అంతకుమునుపు ఎన్ని మందులు వాడేదాన్నంటే మా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ధ్యానం చేయడం ప్రారంభించిన తరువాత " మన రోగాలకు మన పాపాలే కారణం " అని తెలుసుకున్నాను.

ఇదిలా ఉండగా ధ్యానం వల్ల చదువులో కూడా చాలా మార్పు వచ్చింది. ముందు నేను చాలా కష్టపడి బట్టీ కొట్టి చదివేదాన్ని. కానీ ఇప్పుడు ఏకాగ్రత పెరగడంతో, అన్నీ అర్ధం చేసుకుంటూ హాయిగా చదువుకోగలుగుతున్నాను. ముందుకన్నా ఇప్పుడు మార్కులు కూడా ఎక్కువ వస్తున్నాయి.

ఈ ధ్యానం వల్ల నా స్వభావంలో కూడా చాలా మార్పు వచ్చింది. ముందు ప్రతి చిన్న విషయానికీ అలిగేదాన్ని. త్వరగా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించుకోగలిగాను.

ఈ మధ్య యువత కోసం పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనే సంస్థను బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారు ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ధ్యాన ప్రచారం. నేను కూడా దీనిలో చేరాను. అందరి ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాను. నాకు ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరిగింది.

 

నీలిమ
హైదరాబాద్

Go to top