" క్షయవ్యాధి నయమైంది "

 

నా పేరు నిషిత్. వయస్సు 21 సంవత్సరాలు. హైదరాబాద్‌లో నేను B.com 3వ సంవత్సరం చదువుతున్నాను. నేను మూడు సంవత్సరాల క్రితం 2000 డిసెంబర్‌లో కర్నూలులో జరిగిన ధ్యానయజ్ఞంలో పిరమిడ్ మాస్టర్ శ్రీ ప్రేమనాథ్ గుప్తా గారి బోధ వల్ల ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

నాకు ధ్యానం వల్ల శారీరకంగా, మానసికంగా, మరి ఆధ్యాత్మికపరంగా చాలా మార్పులు కలిగాయి. ధ్యానం వల్ల కలిగిన మొట్టమొదటి అనుభవం ఏమిటంటే నాకు ఒకటిన్నర సంవత్సరం క్రితం క్షయవ్యాధి సోకింది. దాన్ని నేను అసలు మందులు వాడకుండా కేవలం ధ్యానం వల్లనే సాంతం పోగొట్టుకున్నాను. ధ్యానవిద్య వల్ల తెలుసుకున్న కొన్ని విషయాలు, నాకు బాగా నచ్చిన విషయాలు ఏమిటంటే.

* ఎవరి వాస్తవానికి వారే సృష్టికరలు
* దేనినయినా ఒకే విధంగా స్వీకరించగలగాలి
* నిన్ను నువ్వు తెలుసుకో
* నువ్వు విశ్వానికి ఏం ఇస్తావో, దానికి ఎన్నో రెట్లు విశ్వం నీకు ఇస్తుంది.
* మన పాపాలే మన రోగాలు
* నువ్వు ఇతరులకు హాని చేస్తే, అది నీకు నువ్వు చేసుకున్నట్టే.

... ఇలాంటి సత్యాలు కొన్ని అయినా మనం మన జీవితంలో ఆచరిస్తే " ఇదే మన ఆఖరి జన్మ చేసుకోవచ్చు " అని తెలుసుకున్నాను.

ఈ మధ్యే యువత కోసం ప్రత్యేకంగా "పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్" అనే సంస్థను హైదరాబాద్‌లో బ్రహ్మర్షి పత్రీజీగారు ప్రారంభించారు. దీనిలో పధ్నాలుగు నుండి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు గలవారు ఎవరైనా చేరవచ్చు. దానికి నేను జాయింట్ సెక్రెటరీగా నియమించబడ్డాను. ఈ సంస్థకి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ప్రేమా మేడమ్ సలహాదారు. ఈ ప్రేమా మేడమ్ ఇంకా దీనిలో ఉన్న సభ్యులం కలిసి అనేక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి ధ్యానం ఎలా చేయాలో ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు గురించి చెబుతున్నాం.

 

నిషిత్
73, వాసవీ నగర్, కార్ఖానా, హైదరాబాద్
ఫోన్ : 27741777

Go to top