" ఏకాగ్రత పెరిగింది "

 

నా పేరు V. రాణిరాజేశ్వరి. వయస్సు 16 సంవత్సరాలు. నాకు ధ్యానం గురించి కర్నూల్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ పరమేశ్వర్‌రెడ్డి గారు చెప్పారు. మొదట్లో నాకు తలనొప్పి ఉండేది. ధ్యానం ద్వారా తలనొప్పి చాలావరకు తగ్గింది. నేను రోజుకొకసారి గంట సేపు ధ్యానం చేస్తాను. మా ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. నేను ప్రతివారం సామూహిక ధ్యానంలో కూర్చుంటున్నాను.

కర్నూల్‌లో జరిగిన మూడు రోజుల ధ్యానయజ్ఞంలో పాల్గొన్నాను. వివిధ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు విన్న తరువాత నాకు ధ్యానంపై ఎక్కువ ఆసక్తి, పట్టుదల పెరిగాయి. నేను ధ్యానంలో సూక్ష్మశరీరం యానం చేసాను. ఇలా కొన్ని అనుభవాలు వచ్చాయి. నాకు వీలున్నప్పుడల్లా మహబూబ్‌నగర్ జిల్లాలోని, వీపనగండ్లలోని " శ్రీ యోగి వేమన పిరమిడ్ ధ్యాన కేంద్రం " లో ధ్యానం చేసి వస్తాను. నాకు ధ్యానం ద్వారా చదువు పై ఏకాగ్రత పెరిగింది. 10వ తరగతిలో మంచి మార్కులతో ప్రధమ శ్రేణిలో పాస్ అయ్యాను. మా స్నేహితులకు కూడా చెప్పి ధ్యానం చేయిస్తున్నాను. మా నాన్న V.G. నాయుడు గారు ధ్యానం యొక్క విశిష్ఠతను మరి ఆధ్యాత్మిక విషయాలు వివరిస్తూంటారు.

 

V. రాణిరాజేశ్వరి
కొండూరు గ్రామం
మహబూబ్‌నగర్

Go to top