" ధ్యాన జగత్తుకై కృషి "

 

మూడు సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు పట్టణం లోని గాంధీరోడ్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస విధానాన్ని తెలుసుకున్నాను. తిరుమల అడవులలో రామకృష్ణ తీర్ధం. తుంబురు తీర్ధం ట్రెక్కింగ్‌కు వెళ్ళినప్పుడు మన గురువు గారు, బ్రహ్మర్షి పత్రీజీ గారితో పరిచయ భాగ్యం కలిగింది. తుంబురు తీర్ధంలో పత్రిసార్ ఫ్లూట్‌తో పాటలు పాడుతూ ధ్యానం గురించి తెలిపారు. అప్పుడు నేను నా గత జన్మలో ఓ యోగిగా తెలిసుకుని పత్రిసార్‌కు తెలియచేసాను. అప్పుడు సార్ తలను ఊపుతూ "అవును" అని సమాధానమిచ్చారు.

అలా నేను శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అభ్యసిస్తూ ఇతరులకు ధ్యానాన్ని గురించి తెలుపుతున్నాను. నా స్వంత పనుల మీద ఇతర గ్రామాలకూ, పట్టణాలకూ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ధ్యానాన్ని గురించి తెలియపరుస్తున్నాను. ధ్యానులుగా వారి అనుభవాలు తెలుసుకుని మీరు ధ్యానంలో తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయమని కోరుతున్నాను.

బ్రహ్మర్షి పత్రీజీ గారి 2012 కల్లా ధ్యాన జగత్తు సంకల్పం జయప్రదం కావాలని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలంతా ధ్యానులు కావడానికి ప్రయత్నిస్తున్నాను.

 

B. వెంకటరమణ
కన్వీనర్: " పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం "
ప్రొద్దుటూరు
కడప జిల్లా

Go to top