" 'ఓటెయ్యండి' అని అడగలేదు"

 

నా పేరు రవీంద్రప్రసాద్. గుడివాడ పిరమిడ్ మాస్టర్ స్వతంత్ర కుమారి గారి కొడుకును. నేను హైదరాబాద్ లో ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాను. అత్తగారు వరలక్ష్మి మేడమ్. అమ్మ, భార్య, కొడుకు అందరూ ధ్యానులే. గుడివాడలో పిరమిడ్ పార్టీలో మా అమ్మగారు గవర్నమెంటు జాబులో ఉండడం వల్ల నిలబడలేకపోయారు. ఇంకొక మాస్టరు అనుకోని పరిస్థితులలో నామినేషన్‌కు రెండురోజులుందనగా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులలో హైదరాబాద్‌లో ఉన్న నన్ను గుడివాడ పిలిచి నామినేషన్ వెయ్యమన్నారు. ఫ్యామిలీలో మిగతా పార్టీలలో ఉన్నవాళ్ళు ఉన్నారు - వాళ్ళకు వ్యతిరేకంగా పిరమిడ్ పార్టీకి నామినేషన్ వెయ్యాల్సి వచ్చింది.

నేను ఎక్కువ ధ్యానం చెయ్యకపోయినా, నాకు పత్రీజీగారి మీద విశ్వాసం, నాతల్లి, అత్తగార్ల జ్ఞానం మీద వాళ్ళు చేసే పని మీద విశ్వాసం. ఇక్కడ ఏది జరిగినా అందరి మంచికోసం అని, అర్ధమయిన జ్ఞానంతో ఇంకొక ఆలోచన లేకుండా నామినేషన్ వేశాను.

"ఓటెయ్యండి" అని అడగకుండా, "ధ్యానం చెయ్యండి, సరిగ్గా ఆలోచించండి", అని చెప్పుకుంటూ అందరికి పాంప్లెట్స్ పంచాం.

ఇలాంటి ప్రచారం ఇంతవరకు ఎక్కడా లేదని మిగతా పార్టీల వాళ్ళకు అర్ధం అయ్యింది. ఈ ప్రచారంలో మాకు ఎలాంటి అవరోధాలు కలుగలేదు. తరువాత హైదరాబాద్ వచ్చేశాను. "M.L.A. అవుతానా? అవ్వనా?" అన్న ఆలోచన కంటే, ఈ తిరగటంలో నాకు "ప్రజలలో సృజనాత్మక స్థితి తేవటానికి ఇది అద్భుతమైన మార్గం" అని అర్ధం అయ్యింది. "నేను పాలకుడిని అయితే ప్రజలకు ఏం చెయ్యాలి? నేను ఎలా ఉండాలి?" అని అర్ధం అయ్యింది.

ఇదీ నా అనుభవం. ప్రస్తుతం నేను సౌత్ ఆఫ్రికా లో, లిబియా లో ఉన్నాను. అక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ధ్యానం గురించి చెబుతున్నాను. పిరమిడ్ పార్టీతో నాకు ఉన్న అనుభవం, అనుభూతి ఇదే.

 

రవీంద్రప్రసాద్
4/54.దుర్గా వైన్స్ వెనుక
బస్టాండ్ రోడ్, గుడివాడ - 521301

Go to top