" 'పిరమిడ్ పార్టీ' తరపున అభ్యర్ధిగా నన్ను ఎన్నిక చేశారు "

 

1999 శాసనసభ ఎన్నికలో M.P. అభ్యర్ధిగా పిరమిడ్ పార్టీ తరపున నన్ను అభ్యర్ధిగా ఎన్నిక చేశారు.

ఈ T.V. వారు వచ్చి "ప్రచారంలో ముఖ్య విషయేమిటి" అనగా "ధ్యానం చేయండి" అని అందరికీ చెప్పాను. వెస్ట్ మారేడ్‌పల్లి వెళ్ళినప్పుడు వారు నాతో రావటం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్‌లో ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది "ఈయన M.P.గా పోటీ చేశారు. ఇటువంటి మంచివారు రాజకీయంలోకి వచ్చినందువల్ల సరియైన పాలన ప్రజలకు అందించబడుతుంది" అని చెప్పారు.

నేను ఎన్నికలలో పోటీ చేయడానికి కారణం ధ్యానాన్ని అందరికీ సరి అయిన ప్రచారం చేసి దానివల్ల వచ్చిన మార్పుతో సరిఅయిన వారిని ఎన్నుకుంటారనే ఉద్దేశ్యంతో పద్మారావునగర్ ప్రాంతాలలో పర్యటించి ధ్యానప్రచారం చెయ్యటం జరిగింది. ఓటు వెయ్యమని ఎవ్వరినీ అడగలేదు. అయినా, ఎన్నికల తరువాత ప్రొఫెసర్స్, లాయర్లు దాదాపు 100 మంది ఫోన్ చేసి "మేము మీకు ఓటు వేశాం" అని చెప్పారు.

 

Dr. నూకల చినసత్యనారాయణ
మహా మహోపాధ్యాయ
హైదరాబాద్

Go to top