" పిరమిడ్ పార్టీ ఒక విత్తనం "

పిరమిడ్ పార్టీ మీటింగ్ 1999వ సంవత్సరంలో తిరుపతిలో జరిగినప్పుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు నన్ను సికింద్రాబాద్ నుండి ఎలక్షన్ లో పోటీ చేయమన్నారు.

మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు నా మనస్సులో ఒక చిన్న సందేహం కూడా రాలేదు. "మన ఆధ్యాత్మిక సంస్థ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తోంది?" అనే ఒక్క ప్రశ్న కూడా కలుగలేదు. ఎందుకంటే నాకు నమ్మకం మన పత్రి గారి మీద పూర్తిగా వుంది. నాకు సంబంధించినంత వరకు పత్రిసార్ మానవరూపం తీసుకున్న సంపూర్ణ దైవ స్వరూపం.

పత్రిసార్‌ను కలిసే ముందు ఎన్నో సంవత్సరాల నుండి ఒక సరియైన మార్గదర్శి కోసం నేను ఎంతో అన్వేషణ చేసాను. ఏ గురువు దగ్గర నా ఆత్మకు తృప్తి కలగలేదు. ఆ పరిస్థితులలో అన్నింటికంటే సులభమైన మార్గం చూపించి, దానిమీద నడిచి "నువ్వే గురువుగా, నువ్వే నీ వెలుగును గుర్తించు. నా చేయి పట్టుకుని నడువవలసిన అవసరం లేదు." అని బోధించిన మహనీయుడే బ్రహ్మర్షి పత్రీజీ.

పత్రీజీ గారిని కలిసినప్పుడే నా ఆత్మకు పూర్ణత్వం అనుభవం కలిగింది. తన ఇల్లు, వాకిలి, భార్యబిడ్డలు వదలి నాలాంటి ఆత్మశాంతి కలగని కోట్లమంది మానవులకు ఆత్మశాంతిని కలిగిస్తూ ఒక్క రూపాయి ఆదాయం కోరకుండా "ఏ ఊరైనా నా ఊరు." "ఏ ఇల్లైనా నా ఇల్లు" అనే వ్యక్తి ఆయన.

ఆయన చూపిన మార్గంలో నడిస్తే ఆ వెలుగే వెలుగు. ఆ ఆనందమే ఆనందం. ఆ జ్ఞానమే జ్ఞానం. ఒకే ధ్యేయం పెట్టుకుని రోజులు గడుపుతున్న ఈ గురువు నాకు లభించారు అంటే నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండవచ్చు. అలా బ్రతుకుతున్న ఆ సమయంలో మీటింగ్‌లో ఈ పిరమిడ్ పార్టీ గురించి చెప్పినప్పుడు నేను గ్రహించిన ఈ మార్గమే సరియైన మార్గమని అనుభూతి కలిగింది.

ఇంతకుముందు ధ్యానంలో నా అనుభూతి ఏమంటే నేడు కాకపోయినా ఏనాటికైనా విశ్వవ్యాప్తంగా సత్య, ధర్మపరిపాలన జరిగితీరుతుంది. మరి మన పిరమిడ్ పార్టీ ప్రస్తుతం కేవలం ఒక విత్తనమే. ఉత్తరోత్తరా ఈ వటవిత్తనం ఓ మహావటవృక్షం అయి తీరుతుంది. దేనికంటే మానవుడు తన లోపల గల దైవత్వాన్ని గుర్తించే మార్గం ధ్యానం ద్వారానే. "ఈ పిరమిడ్ పార్టీ లో నేను పాల్గొంటే అది ధ్యానాన్ని ఎత్తి చూపించే ఒక ఫ్లాట్‌ఫారం గానే గుర్తించబడుతుంది." అనే ఆశతో నేను దీనిలో పాల్గొన్నాను.

రూ. 5000 మాత్రమే సీట్ కోసం కట్టి తోటి ధ్యానులతో కలిసి ఎంతో హాయిగా ఓటు కోసం అడగకుండా అందరికీ ధ్యానాన్ని గురించి చెప్తూ ఇలా సంతోషంగా గడిపాను. ఎలక్షన్ మాత్రమే ఓడిపోయాను. కానీ ఎంతో మందిని ధ్యాలునుగా మార్చగలిగానని ఆత్మానందంలో మా సుభాష్ పత్రిగారికి కృతజ్ఞతలు అర్పిస్తూ, "తిరిగి ఆయన ఎలక్షన్‌లో నిలబెట్టినా నిలబడటానికి సిద్ధంగా ఉంటాను" అని తెలియజేస్తున్నాను.

 

- షాలినీ బాలాజీ,
ఫ్లాట్ నెం. 101, సూర్య ఎంక్లేవ్, తిరుమలగిరి, సికింద్రాబాద్

Go to top