" ఏమని చెప్పను? "

 

చెత్తా చెదారంలో కూరుకుపోయిన నన్ను శ్వాసానుసంధానంతో పైకి లేపారని చెప్పనా... చిత్తుకాగితంలా చెత్త చెత్తగా ఎగిరిపోతున్న నన్ను తన దివ్యకరచాలనంతో స్థిరపరిచారని చెప్పనా ... ఏకైక వారసుడైన పద్దెనిమిదేళ్ళ బాబు చనిపోయిన పుత్ర శోకం నుంచి మరణ రహస్యం గుట్టు విప్పి చూపించి అమృతం చిలికించారని చెప్పనా ...

అశాంతి, ఆందోళన, అనారోగ్యాలతో ఎడ్రస్సే లేని నాకు ఎప్పటికీ పై దివ్యలోకాల్లో స్థిర నివాసం కల్పించారని చెప్పనా ... పాదాభివందనం వారించి " రామచంద్రా " అంటూ తన దివ్య తరంగాలతో ... ప్రతి ఒక్కరినీ పునీతం చేసి "అహం బ్రహ్మాస్మి" అని తెలుసుకోమన్నారని చెప్పనా ... అజ్ఞానంలో వున్న నన్ను తన విశేష పరిజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో...

ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించారని చెప్పనా? ఆధ్యాత్మిక పరిభాషలో ఒక్క ముక్కైనా, ఒక్క నిముషమైనా మాట్లాడలేని నన్ను ... కూర్చున్నా, మాట్లాడినా, నడుస్తున్నా, నిద్రపోతున్నా ఆలోచనలతో నిండిన బుర్రను మౌనంతో ఖాళీ చేయించి, ఒక్క ఊహతో ఆజ్ఞా చక్రంలోకి నెట్టారని చెప్పనా .... నేనవర్ని? ఎందుకిక్కడికి వచ్చాను ? ? ఎక్కడి కెళ్ళాలి ? అనే ప్రశ్నలకు, నన్ను నా జీవితాన్ని, నేర్చుకోవలసిన పాఠాలు, గమ్యం నేర్పారని చెప్పనా ....

ఎనర్జీ అంటే ఏమిటో తెలియని నాకు పిరమిడ్ శక్తిని ప్రసాదించి అంతర్ శక్తిని పెంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించారని చెప్పనా ... ఏమని చెప్పను...

మీరెవ్వరూ నాకు శిష్యులు కారంటూ, మీ శ్వాస మీకు గురువంటూ అందర్నీ భూతలం మీదే మాస్టర్లుగా మలచిన నిగర్వి, మహాద్రష్ట, బ్రహ్మర్షి పత్రీజీ గారికి సహస్రాభివందనాలు.

 

ములకా బాలాజి
విశాఖపట్టణం

Go to top