" నా జన్మ కర్తవ్యాన్ని నేరవేర్చుకుంటున్నాను "

 

నా పేరు విష్ణానంద.

మాది నెల్లూరు జిల్లా, T.P. గూడూరు గ్రామం, శ్రీ భద్రకాళి పీఠం. నేను 2010 డిసెంబర్ 21 వ తేదీన గుంటూరు జిల్లా " అమరావతి " లో జరిగిన పదకొండు రోజుల ధ్యానమహాచక్రంలో మొట్ట మొదటిసారి బ్రహ్మర్షి పత్రీజీ సమక్షంలో ధ్యానం నేర్చుకున్నాను.

అంతకు ముందు 36 సంవత్సరాలుగా నేను ఎందరెందరో ఆధ్యాత్మిక గురువులను కలిసి ఎన్నెన్నో సాధుపరిషత్తుల్లో పాల్గొని మరి అనేక మంది పీఠాధిపతుల సాంగత్యాన్ని పొందడం జరిగింది. అయితే " శ్వాస మీద ధ్యాస " ధ్యానం ద్వారా మాత్రమే నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఆత్మ శాంతితో కూడిన అద్భుతమైన అనుభవాన్ని పొందాను.

గత పదమూడు సంవత్సరాలుగా నేను పక్షవాతం జబ్బుతో బాధపడుతూ ఆర్థికంగా, శారీరకంగా నరకం అనుభవిస్తూ .. కర్రసాయంతోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. ఒక్కోసారి జీవితం మీద విరక్తి చెంది .. " ఆత్మహత్య చేసుకోవాలి " అనిపించి కూడా .. " ఆత్మహత్య మహాపాపం " అన్న విషయం తెలుసు కనుక విరమించుకునేవాడిని.

అయితే గుంటూరు జిల్లా అమరావతిలో నేను మొట్టమొదటి రోజు ధ్యానం చేసాక నాలో క్రొత్త ఉత్సాహం మొదలై .. మరుసటి రోజు నుంచి అక్కడ " వాలంటీర్ " గా నా సేవలందించడం మొదలుపెట్టాను. ఆ పదకొండు రోజులపాటు ధ్యానం, పత్రీజీ దర్శనం, వాలంటీర్ సేవలతో నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ ధ్యానశక్తివల్ల నా శరీరం ఎంతో స్వస్థత చెంది .. ఆశ్చర్యంగా అప్పటివరకు నెలకు మూడు వేల రూపాయల మందులు వాడే నాకు .. అమరావతి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మందులు వాడాల్సిన అవసరం పూర్తిగా పోయింది.

నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడి నాకు ఉన్న షుగర్, B.P. అన్నీ తగ్గి .. నేను గ్రామ గ్రామాన ధ్యాన ప్రచారం చేయడం మొదలు పెట్టాను. " ప్రజలకు ఉన్న రోగాలతో పాటు వారి భవరోగాలను కూడా తగ్గించగలిగే శక్తి ఒక్క ధ్యాన సాధనకు మాత్రమే ఉంది " అని నేను ఘంటాపథంగా చెపుతూ ధ్యాన ప్రచారం ద్వారా నా జన్మ కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటున్నాను.

 

స్వామి విష్ణానంద
నెల్లూరు

సెల్ : +91 9000455718

Go to top