" 'అహం బ్రహ్మాస్మి' స్థితిని అనుభూతి చెందాను "

 

నా పేరు సత్యవతి.

మాది ఖమ్మం జిల్లా, మధిర. నేను 2010 నవంబర్ 25 న మా అమ్మ " శ్రీలక్ష్మి " ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఒక రోజు నాకు ఒంట్లో బాగాలేక, విపరీతమైన తలనొప్పి, వాంతులు, తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. మా వారు డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు కానీ నేను " వెళ్ళ కూడదు " అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాను.

అప్పుడు పత్రీజీ నాకు ధ్యానంలో ప్రత్యక్షమై " జయం జయం " అన్నారు. నాకు అది మొదటి ధ్యాన అనుభవం.

ఏదో మాయ జరిగినట్లు కాస్సేపటికే నాకు తలనొప్పి తగ్గిపోయి నేను ఎంతో హుషారుగా అయ్యి ఇక నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా పోయింది.

ధ్యానంలో ఒకసారి నేను నా ఆత్మజ్యోతిని దర్శించాను. ఆ జ్యోతి వెలుగులో నాకు ప్రకృతి అంతా కొత్తగా, వింతగా కనపడుతూ అందమైన పూల తోటలూ, కొండలూ, నదులూ, సెలయేళ్ళలో ఎందులో చూసినా నేనే కనిపిస్తున్నాను. ఎంతో ఆనందం, పరమానందం, బ్రహ్మానందం పొందిన, నాకు .. పరమాత్ముడు నాలోకే వచ్చిన అనుభూతి కలిగింది.

‘ అహం బ్రహ్మాస్మి ’ అన్న తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందిన నేను .. " నా జన్మ ధన్యమైంది " అని ఆనందించాను.

 

 

M. సత్యవతి
ఖమ్మం జిల్లా

సెల్ : +91 9849133846

Go to top