" నా శరీరంలో ప్రతి అణువుతో స్నేహం చేసాను "

 

నా పేరు శరత్.

మాది పశ్చిమగోదావరి జిల్లాలోని " నల్లజర్ల " గ్రామం. నాకు రెండు కిడ్నీలు పాడైపోయి .. డయాలిసిస్ పై ఉన్నాను. అప్పుడు మా పిన్ని నాకు ఒక ధ్యానం పాంప్లెట్ ఇచ్చి ధ్యానం గురించి వివరించింది. నేను ఆ కరపత్రం ద్వారా " మేకా వేంకటేశ్వరావు " గారికి ఫోను చేయగా ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి .. నాకు ధ్యానం నేర్పారు. నేను అప్పటి నుంచి మానకుండా రోజుకి ఆరు గంటలపాటు ధ్యానం చేస్తూ కాస్తంత మనఃశాంతిని పొందాను. కానీ వారానికి ఒక బ్లడ్ పాకెట్ మాత్రం ఎక్కిస్తూ ఉండేవారు.

ఇలా నేను ధ్యానం ద్వారా పొందిన మనఃశాంతి మరి ఏకాగ్రతల వల్ల బెడ్పై ఉంటూనే " MBAరెండవ సంవత్సరం " పరీక్షలు వ్రాసి డిస్టింక్షన్ లో పాసయ్యాను. కానీ .. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోయి .. " బ్రతకడం కష్టం " అని డాక్టర్స్ చెప్పారు.

అప్పుడు విశాఖపట్టణం " ఆనంద్ కుమార్ సార్ " నాకు పరిచయం అయ్యి .. ఎంతో ధైర్యం చెప్పి .. నా లోని భయాన్ని పోగొట్టి " నేను 108 రోజుల అఖండధ్యానం సింహాచలం లో నిర్వహిస్తున్నాను, అక్కడికి రా " అని చెప్పారు.

" 108 రోజుల అఖండ ధ్యానం " లో ప్రతిరోజూ నేను నా కిడ్నీలు చూసుకుంటూ, నా శరీరంలోని ప్రతి ఒక్క అణువుతో మాట్లాడుకుంటూ .. నాకు నేనే స్వంతంగా ఆస్ట్రల్గా డయాలసిస్ చేసుకునేవాడిని. క్రమంగా నా ఆరోగ్యం కుదుటపడి .. నాకు బ్లడ్ ఎక్కించే అవసరం కూడా తగ్గిపోయింది. పత్రీజీ చెప్పిన " ఆరోగ్యమే మహాభాగ్యం " సి.డి. ద్వారా నేను ఎన్నెన్నో శాస్త్రీయమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని నాకు నేనే చికిత్స చేసుకున్నాను. ఇది ఒక గొప్ప ధ్యానాద్భుతం !

ప్రస్తుతం మా ఇంటిపై 9' X 9' పిరమిడ్ కట్టుకుని " విశ్వసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం " అని బ్రహ్మర్షి పత్రీజీ చేతుల మీదుగా 11.07.2011 న ప్రారంభోత్సవం జరిపించుకుని ధ్యాన ప్రచారం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాము.

 

 

నాగేంద్ర శరత్
పశ్చిమగోదావరి

సెల్ : +91 9441758532

Go to top