" ధ్యానం ఉన్న దగ్గర .. దుఃఖం ఉండదు "

 

నా పేరు కృష్ణకుమారి.

నేను గత పది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ద్వారా నేను లెక్కలేనన్ని అనుభవాలు పొంది. " నో డాక్టర్ ", " నో మెడిసిన్స్ " అంటూ చాలా ఆనందంగా జీవిస్తున్నాను.

ఎన్నో యేళ్ళ నుంచి నేను అతి మూర్ఖంగా చేస్తూ ఉండే అర్థం పర్థం లేని వ్రతాలూ, పూజలూ పూర్తిగా వదిలేసి .. ధ్యాన ప్రచారమే జీవితంగా ఉన్నాను.

జూన్ 1 వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ .. పలమనేరు విచ్చేసినప్పుడు జరిగిన సంగీత జ్ఞాన శిక్షణా కార్యక్రమంలో " మనిషికి ధ్యానం ఉంటే దుఃఖం అతని దరిచేరదు. సంపూర్ణ ఆరోగ్యం, బుద్ధి కుశలత మరి మానవత్వం అన్నవి కేవలం ధ్యాన సాధన ద్వారానే అలవడతాయి . " అంటూ ఇచ్చిన సందేశం విని " సమాజం మొత్తం ధ్యానం మయం కావాలి " అని కంకణం కట్టుకుని మరీ ధ్యానప్రచారం చేస్తున్నాను.

 

M.C. కృష్ణకుమారి
సెల్ : +91 9441809679

Go to top