" ఆచార్య సాంగత్యం .. ఎంతో భాగ్యదాయకం "

 

నా పేరు కుందుల అంజలీదేవి.

" ధ్యానం సర్వరోగనివారిణి " అన్నది అక్షరసత్యం. ఇది నా మొదటి ధ్యానానుభవం. ఎందుకంటే నేను ధ్యానం ద్వారానే నా నడుమునొప్పి, తుంటినొప్పి, నిరంతరం జలుబు, గ్యాస్ట్రబుల్ నుంచిపూర్తి విముక్తిని పొందాను. చీరాల సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారి ద్వారా ధ్యానం నేర్చుకుని పౌర్ణమి ధ్యానం ద్వారా శరీరంలోని ప్రతి ఒక్క కణం, ప్రతి నాడికి విశ్వమయ ప్రాణశక్తిని సమకూర్చుకున్నాను .

మాస్టర్ శ్రీనివాస్ గారు ఒకసారి పౌర్ణమి ధ్యానం చేయించినప్పుడు నా శరీరంలోంచి ఆరు శరీరాలుగా విడివడి బయటకు వెళ్తూనట్లు చూసుకున్నాను. " ఇప్పుడు ఇక్కడున్న ఈ శరీరం ఎలా వుంది ? " అని గమనిస్తూ వుంటే ఒక రోబోట్లా ప్రతి ఒక్క శరీర అవయవ భాగాలు ఎనర్జిటిక్గా దృఢంగా మారిపోయాయి. ఆ రోజు నుంచి శరీరంలో వున్న ‘ లూజ్ బాడీ ’ తగ్గిపోయి బద్ధకం కూడా పూర్తిగా తొలిగిపోయింది. అంతే .. ఆ రోజు ఆశ్చర్యపోయాను " మన శరీరంలోనే ఇన్ని అద్భుతమైన విషయాలు, లోకాలు చూడగలుగుతున్నామా ? " అని. అప్పటినుంచి నా ధ్యానసాధన ఎక్కువైంది. " ఎప్పుడు ఇంట్లో పని పూర్తవుతుందా, ఎప్పుడు ధ్యానస్థితిలో లయమవుదామా " అన్న తపనతో ధ్యానం చేసేదాన్ని.

శ్రీశైలం ధ్యానయజ్ఞంలో ఐదురోజులు పాల్గొన్నాను. ఆ ఐదురోజులు ఐదుక్షణాల్లా గడిచిపోయాయి. పత్రీజీ వేణునాద ధ్యానంలో బృందావనం అంతా చూసివచ్చేదాన్ని. శ్రీ కృష్ణుణ్ణి పసిబాలుడిగా దర్శించేదాన్ని మూడుగంటలు మూడునిమిషాలుగా గడిచిపోయేవి. అంతకుముందు కుర్చీలో ఎప్పుడూ గంట కూడా స్థిరంగా కూర్చోలేని బ్రహ్మర్షి సన్నిధానంలో అలా కూర్చోగలిగాను అంటే " అది ఆ స్వామీజీ ఇచ్చిన శక్తే " అని తెలుసుకున్నాను. " ఇది ఆచార్య సాంగత్యఫలం " అని అవగతమైంది.

తెనాలి ధ్యానయజ్ఞానికి పత్రిసార్ వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాం. అక్కడ సార్ ధ్యానం చేయించేటప్పుడు భూమిలో నుంచి వచ్చే ప్రకంపనలుగా ఆ వేణునాదంతో ప్రతి ఒక్కరికీ ఎంత శక్తిని ప్రసాదించారో చూస్తోంటే .. " ఆ కృష్ణ భగవానుడే వచ్చారా " అనిపించింది. ఆ ధ్యానంలో సార్ నాకు ఎన్నో కాంతిపుంజాలుగా, కాంతిలోకాల్లో విహరిస్తూ వేణువు ఊదినట్లే దర్శనమిచ్చారు. ఆ రోజు పత్రిసార్ని అంతమందిలోనూ కలిసి అనుభవం చెప్పాను. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి శరీరమంతా కరెంట్ ప్రవహించినట్లే వుంది. అప్పటినుంచి పిరమిడ్లో కూర్చుని ఎప్పుడు ధ్యానం చేసిన ఏ సంకల్పం పెట్టుకున్నా అది నెరవేరుతోంది. " ఒక ఆత్మజ్ఞాని సహవాసం వల్ల కలిగే లాభం రెండు కళ్ళకు కనిపించదు " అన్నది ఎంత నిజమో, ఆచార్యసాంగత్యం ఎంతో ఎంతో లాభాదాయకం .. మరి మనల్ని ఉన్నత స్థితికి చేర్చే భాగ్యదాయకం. అందుకే మా శ్రీనివాస్ సార్ మా అందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ పత్రిసార్ ఎక్కడికి వచ్చినా తీసుకువెళ్తూ వుంటారు.

నరసరావుపేట ధ్యానయజ్ఞానికి వెళ్ళినప్పుడు క్లాసుకు వెళ్ళకముందే సార్తో ఇరవైనిమిషాలు కలిసే భాగ్యం లభించింది. ఇరవై నిమిషాలలో సార్ ఎన్నో విషయాలు చెప్పి, ఎంతో జ్ఞానాన్ని పంచారు. " ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండటానికి ఇక్కడికి వచ్చారు ; ఈ శరీరాన్ని తీసుకున్నది ఆనందంగా ఉండటానికే " అని చక్కటి జీవిత సత్యాన్ని చెప్పారు.

మే 10 న ఒంగోలులో ధ్యానయజ్ఞానికి .. చీరాల నుంచి ఎనభైమంది వరకు వెళ్ళాం. సార్ మొదటిసారి నలభైనిమిషాలు ధ్యానం చేయించి ఆ గ్రౌండ్లో వున్నమహాజనానికి వైబ్రేషన్స్ అందించారు. రెండవసారి ధ్యానం నలభైనిమిషాలు వేణునాదంతో చేయించినప్పుడు అక్కడ వున్న ప్రతిఒక్కరి శరీరంలోకి సహస్రారం నుంచి విశ్వశక్తి వస్తూనే వుంది. శరీరం దూదిపింజంలా అనిపించింది. త్రిశూలంలో శివధారణలో నృత్యం చేస్తూనే వున్నాను మరి అద్భుతంగా ఆకాశం నుంచి నక్షత్రాలు నా తలలో పడుతూనే వున్నాయి.

మోక్షమొసగే గురువుని పొందగలిగాను .. ఈ ఆఖరిజన్మ ఎంత భాగ్యమో, ఇంక వర్ణించటానికి నేను కవిని కాను. మామూలు గృహిణిని. నా ఆనందానికి అవధులు లేవు.

 

- కందుల అంజలీదేవి,
చీరాల
ఫోన్ : +91 9704466837

Go to top