" ఎముకల సర్జరీ "

నా పేరు శ్రీ హారిక.

నేను 7వ తరగతి చదువుతున్నాను.

మా అమ్మ, నేను .. " చంద్రకళ మేడమ్ " ద్వారా ధ్యానం తెలుసుకుని 4 సం||ల నుంచి ధ్యానం చేస్తున్నాము. అప్పటినుంచి మేమందరమూ టాబ్లెట్స్, డాక్టర్ అనేది లేకుండా ఉన్నాము.

12-10-2009 వ తేదీన మా స్కూల్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యి ఎడుమభుజం క్రింద ఫ్రాక్చర్ అయ్యింది. నాలుగు రోజులు ఎడమచెయ్యి క్రిందకు పెట్టలేకపోయాను. రాత్రి పడుకున్నప్పుడు, పగలు పూట నొప్పి వచ్చేది. ఏడుపు వచ్చేది. నాన్నగారు చూస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారని నాన్నగారి ముందర ఏడుపును ఆపుకునేదాన్ని. " ధ్యానంతోనే నయం అవుతుంది " అని నాకు నమ్మకముంది. 5వ రోజు మా అమ్మ .. ఆదోని ప్రేమ్నాథ్ మాస్టర్ తో సంకల్పం పెట్టించి, ధ్యానంలో కూర్చోబెట్టింది.

ధ్యానంలో పన్నెండు మంది ఆస్ట్రల్ మాస్టర్స్ డాక్టర్స్ రూపంలో వచ్చి విరిగిన నా ఎముకులను చూపించారు. రెండు ఎముకలను జాయింట్ చేసి అందరూ కలిసి జాయింట్ దగ్గర ఎనర్జీని ఇచ్చారు. వాళ్ళు ఆస్ట్రల్ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు భౌతికంగా చాలా నొప్పిగా ఉండింది.

తరువాత పత్రిసార్ వచ్చి, " నువ్వు ఈ యాక్సిడెంట్లో శరీరాన్ని వదిలి వేయాల్సి ఉండింది. కానీ ధ్యానం చేస్తున్నావు కనుక కేవలం ఫ్రాక్చర్తో సరిపోయింది " అన్నారు. మాస్టర్స్కూ, పత్రిసార్కూ నా కృతజ్ఞతలు. ఈ ప్రాసెస్ మొత్తం 20 ని||లు పాటు జరిగింది. తరువాత ధ్యానంలో నుంచి బయటకు వస్తూనే ఎడమచెయ్యిని గిరగిరా త్రిప్పగలిగాను. తరువాత ఎటువంటి నొప్పిలేదు. బరువులు కూడా మోయగలిగాను.

మా అమ్మ అందరితో ధ్యానం చేయిస్తూ, క్లాసులు కూడా చెబుతుంది. నాన్న, తాత ధ్యానానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూంటారు. అమ్మ పల్లెలకు వెళ్ళి ధ్యానం చెబుతుంది. ప్రతి తల్లి కూడా మా అమ్మలాగే వాళ్ళ పిల్లలకు ధ్యానం నేర్పించాలని కోరుతున్నాను.

 

- శ్రీ హారిక,
ప్రొద్దుటూరు

Go to top