" పత్రీజీది వేయి తల్లుల ప్రేమ "

నా పేరు లక్ష్మి.

మాది జగిత్యాల. నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ధ్యానాన్ని ఆచరిస్తున్నాను. నాకు ధ్యానంలోకలిగిన అనుభవాలు ఎన్నో వున్నాయి. ఆ అనుభవాలన్నీ కూడా పత్రీజీ ఆదేశానుసారం " ధ్యానం సర్వమయం " అనే చిన్న పుస్తకం ద్వారా అందరితో పంచుకోవడం జరిగింది.

జూన్ 4 వ తేదీ బ్రహ్మర్షి పత్రీజీ జగిత్యాల పట్టణానికి రావడం మరి అక్కడ బాలాజీ పిరమిడ్ ధ్యానకేంద్రంలో జరిగిన ధ్యానం క్లాసులో ఒక అద్భుతం జరిగింది. అప్పటికి వారంరోజుల నుంచి నేను బ్యాక్పెయిన్తో చాలా బాధపడుతున్నాను. నాకు నడవడానికి కూడా ఇబ్బందిగా వుండేది. నేను ధ్యానంలో కూడా ఇబ్బందిగానే కూర్చున్నాను. పత్రీజీ ఫ్లూట్ వాయిస్తూ, పాటలు పాడుతూ ధ్యానం చేయిస్తున్నారు. ధ్యానంలో చాలా లీనమైపోయాం. నాకైతే ఆనందభాష్పాలు కూడా వచ్చాయి. సార్ ఫ్లూట్లో నుంచి నీలం రంగు ఎనర్జీ వచ్చి నాలో ప్రవేశించి నాకు ఎక్కడైతే నొప్పిగా వుందో అక్కడికి వెళ్ళింది. ధ్యానం నుంచి లేచేసరికి నా వీపునొప్పి అంతా పోయింది .

నాకేమీ అర్థం కాలేదు. సార్ వచ్చి పలకరించినా కూడా నేను ఇంకా తేరుకోలేకపోయాను . చాలా అద్భుతంగా అనిపించింది. పత్రీజీది వెయ్యితల్లుల ప్రేమ. ఎన్ని రోజులైనా అదే ఎన్ని సంవత్సరాలైనా అదే తరగని ప్రేమ. హ్యాట్సాఫ్ గురూజీ.


- V. లక్ష్మీ శ్రీధర్,
జగిత్యాల

ఫోన్ : +91 9866172676

Go to top