" ధైర్యంగా డాన్స్ చేసాను "

నా పేరు శ్రావణి.

మాది సిద్ధిపేట. నా తల్లితండ్రులు " లత ", " ప్రభాకర్ " నేను ఆరవతరగతి చదువుతున్నాను.

నేను 2003 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను, మా అన్నయ్య " సాయిరోషిత్ ", అమ్మ నాన్న .. అందరం కలిసి ప్రతిరోజూ ధ్యానం చేస్తాం. నేను చదువుకుంటూనే ధ్యానం చేయడంతో పాటు, మా అమ్మ నాన్నలతో కలిసి ధ్యానం క్లాసులకు వెళ్తాను. గత సంవత్సరం మా నాన్నగారు ‘ M.L.A. ’ గా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా నాన్నగారితో పాటు జీపులో 150 గ్రామాలు పాంప్లెట్స్ పంచి అందరికీ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. పత్రిసార్ క్లాసులో పాంప్లెట్స్ పంచుతాను. మా అమ్మ నాన్న ప్రోద్భలంతో నేను భరతనాట్యం నేర్చుకుని 2005 లో బెంగళూరులో, మరి 2006 లో షిర్డీ ధ్యాన మహాయజ్ఞంలో డాన్స్ చేసాను.

28-4-2010 న సార్ బచ్చన్నపేటలో ఉన్నప్పుడు కూడా డాన్స్ చేసాను. సార్ నా డాన్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది .. ఎందుకంటే ఈ క్లాస్ కంటే ముందు 14-4-2010 న నేను క్రిందపడినప్పుడు నా తలకు దెబ్బతగిలి ఐదు కుట్లు పడ్డాయి. కట్టు విప్పిన నాలుగురోజులకే ఈ డాన్స్ చేస్తున్నప్పుడు మా డాడీ " నువ్వు చెయ్యగలవా ?? " అని అడిగారు. " నేను సార్ ముందు తప్పకుండా చేస్తాను " అని చెప్పాను. అలాగే నేను చేసిన డాన్స్ చూసి పత్రిసార్ నన్ను హత్తుకుని .. ఎంతో మెచ్చుకున్నారు. అంతకుముందు రోజు సారే " డాక్టర్ రూపంలో వచ్చి కుట్లు వేయడం " అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ధైర్యంతోనే డాన్స్ చేసాను. మనం ధ్యానం చేస్తే చాలా ధైర్యంగా వుంటాం.

 

- బిట్ల శ్రావణి,
సిద్ధిపేట

ఫోన్ : +91 8801604601 , +91 94407 07234

Go to top